Begin typing your search above and press return to search.

నాడు కూతురు.. నేడు గర్ల్ ఫ్రెండ్..

అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మేకోవర్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంతలోనే అంత మార్పా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   19 Dec 2025 1:06 PM IST
నాడు కూతురు.. నేడు గర్ల్ ఫ్రెండ్..
X

సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని.. అందులో సక్సెస్ కావాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు గానే ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అక్కడే తమ అద్భుతమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో.. డైలాగ్ డెలివరీతో.. కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకొని.. పదుల సంఖ్యలో అవకాశాలను అందుకొని.. ప్రేక్షకులను మెప్పిస్తారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు మళ్లీ పెద్ద హీరోల పక్కన హీరోయిన్లుగా తెరపై కనిపిస్తుంటే.. వారి మేకోవర్ ను చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మేకోవర్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంతలోనే అంత మార్పా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అలాంటి వారిలో ఇప్పుడు చెప్పబోయే ఒక చైల్డ్ ఆర్టిస్టు అందరిని తన అద్భుతమైన నటనతో మెప్పించడమే కాకుండా.. అప్పుడు కూతురుగా ఇప్పుడు ఏకంగా గర్ల్ ఫ్రెండ్ గా మెప్పిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ఆమె ఎవరో కాదు విక్రమ్ హీరోగా వచ్చిన నాన్న సినిమాలో విక్రమ్ కి కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్. తాజాగా ఈమె ఆదిత్యా ధార్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, R. మాధవన్, రాకేష్ బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ధురంధర్ చిత్రంలో హీరోకి గర్ల్ ఫ్రెండ్ గా నటించి తన అద్భుతమైన నటనతో అందరిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఈమెకు సంబంధించిన జర్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నాన్న సినిమాలో విక్రమ్ కూతురుగా మొదలైన ఆమె సినీ ప్రస్థానం.. నేడు ధురంధర్ సినిమాలో గర్ల్ ఫ్రెండ్ వరకు ఎలా సాగింది? అనే విషయాన్ని హైలెట్ చేస్తూ పీవీఆర్ సినిమాస్ ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

ఆ వీడియో విషయానికి వస్తే.. 2011లో విక్రమ్ హీరోగా వచ్చిన నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. ఆ తర్వాత 2023లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యారాయ్ చిన్నప్పటి పాత్రలో అలరించింది. అలాంటి ఈమె ఇప్పుడు తాజాగా రణ్ వీర్ సింగ్ సరసన ఆయన గర్ల్ ఫ్రెండ్ గా నటించి , తన నటనతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 1300 మందిని కాదని ఈ పాత్రకు సారా అర్జున్ ను ఎంపిక చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈమె.. తన అద్భుతమైన నటనా పర్ఫామెన్స్ తో వంద మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు.

మొత్తానికి అయితే నాడు కూతురి పాత్రలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. స్టార్ హీరోల సరసన కథానాయకగా నటించే స్థాయికి ఎదగడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. ప్రస్తుతం ధురంధర్ సినిమా స్క్రీనింగ్ అవుతున్న పివిఆర్ థియేటర్ యాజమాన్యం ఈ వీడియోని షేర్ చేశారు.