Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ సెన్సేషన్‌గా సారా అర్జున్-ఇషాన్ ఖట్టర్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సారా అర్జున్ - ఇషాన్ ఖట్టర్ జంట గురించే చర్చ జరుగుతోంది.

By:  Sivaji Kontham   |   12 April 2026 11:53 PM IST
ఇంటర్నెట్ సెన్సేషన్‌గా సారా అర్జున్-ఇషాన్ ఖట్టర్
X

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సారా అర్జున్ - ఇషాన్ ఖట్టర్ జంట గురించే చర్చ జరుగుతోంది. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఏ పర్ఫెక్ట్ మ్యాచ్` అనే మైక్రో-సిరీస్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీకి ఫిదా అయిన అభిమానులు... వీరిద్దరినీ కలిపి పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్‌లో చూడాలని కోరుకుంటున్నారు. ఈ చిన్నపాటి డిజిటల్ డ్రామా కేవలం కొద్ది రోజుల్లోనే ఈ జంటను ఇంటర్నెట్ మోస్ట్ ఫేవరెట్ జోడీగా మార్చేసింది.

ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్‌కు చెందిన టైగర్ టెల్లీ సహకారంతో రూపొందిన ఈ ఆరు భాగాల మైక్రో-సిరీస్ కథాంశం.. సాంకేతికతను సరికొత్తగా మేళవించింది. నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే సాధారణ పరిస్థితులను సెర్చ్ ఇంజిన్ సెర్చ్‌తో ముడిపెడుతూ సాగే ఈ ప్రేమకథ ప్రేక్షకులకు చాలా సహజంగా అనిపిస్తోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు విడుదలవ్వగా... ప్రతి ఎపిసోడ్‌తోనూ ఈ జంటపై క్రేజ్ పెరుగుతూనే ఉంది.

సారా-ఇషాన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ రొటీన్ మాస్ సినిమాల్లో ఉండే క్లిష్టమైన పాత్రలకు భిన్నంగా.. చాలా ఫ్రెష్‌గా ఉండటం విశేషం. వీరి మధ్య ఉన్న వైబ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా.. ఒక రకమైన భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తోంది. వీరిద్దరినీ వెండితెరపై పెద్ద సినిమాగా చూడాలని ఉంది.. వీరి కలయిక అద్భుతంగా ఉంటుంది! అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ర‌ణ్‌వీర్ కాదు సారా అర్జున్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికాడు! అంటూ ఇషాన్ ని కీర్తిస్తున్నారు నెటిజ‌నులు.

ఇటీవలే సారా అర్జున్ నటించిన `ధురంధర్`... ఇషాన్ ఖట్టర్ నటించిన `హోమ్‌బౌండ్` చిత్రాలు భారతీయ సినిమాలో సరికొత్త ఒరవడిని సృష్టించాయి. నవతరం సినిమాలకు ప్రతినిధులుగా మారిన ఈ ఇద్దరు ప్రతిభావంతులు ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్‌లో కనిపించడం సినీ ప్రియులను ఉత్సాహపరుస్తోంది. ఒకవేళ ఈ జంట ఒక పూర్తి స్థాయి సినిమాలో గనుక నటిస్తే... అది బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషనల్ హిట్‌గా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ మైక్రో సిరీస్ ద్వారా మాత్రమే అలరిస్తున్న ఈ జంటను భవిష్యత్తులో ఏ దర్శకుడు పెద్ద తెరపై చూపిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం వీరిద్దరిని కలిపి సినిమా చేసే ఆలోచనలు ఇంకా ఎవ‌రిలోను లేవు. అభిమానుల ఒత్తిడి.. ఈ సిరీస్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే త్వరలోనే ఒక భారీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.