Begin typing your search above and press return to search.

ధురంధర్ కంటే గొప్ప గుర్తింపు అదే!

విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి సారా పంచుకున్న విశేషాలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   31 Jan 2026 7:00 PM IST
ధురంధర్ కంటే గొప్ప గుర్తింపు అదే!
X

సారా అర్జున్.. ఈ పేరు వినగానే మనకు 'నాన్న' సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన ఆ చిన్నారి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి 'ధురంధర్' చిత్రంతో హీరోయిన్‌గా మారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే, తన కెరీర్‌లో ఈ సక్సెస్ కంటే కూడా మర్చిపోలేని ఒక అద్భుతమైన జ్ఞాపకం ఉందని ఆమె తాజాగా వెల్లడించింది. విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి సారా పంచుకున్న విశేషాలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో తన సినీ ప్రయాణంలోని మధుర సన్నివేశం గురించి వివరించింది. వివరాలలోకి వెళితే ..

ఐశ్వర్య రాయ్‌తో మధుర జ్ఞాపకం:

హీరోయిన్‌గా తన మొదటి సినిమా 'ధురంధర్' విజయం సాధించడం సారా అర్జున్‌కు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. కానీ, ఆమె దృష్టిలో అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉంది. మణిరత్నం రూపొందించిన భారీ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'లో సారా.. ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ.. "ఐశ్వర్య రాయ్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం. సెట్‌లో ఆమె నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అయితే, రీసెంట్‌గా ఆమెను కలిసినప్పుడు ఆమె నన్ను వెంటనే గుర్తుపట్టి ఎంతో ఆత్మీయంగా పలకరించారు. అంతటి గొప్ప నటి నన్ను ఇంకా గుర్తుంచుకోవడం నిజంగా 'ధురంధర్' సక్సెస్ కంటే పెద్ద గుర్తింపుగా భావిస్తున్నాను" అని సారా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఆడిషన్స్ నుంచి హీరోయిన్ వరకు:

సినిమాల్లోకి రావడం గురించి సారాకు కొన్ని కలలు ఉన్నప్పటికీ, హీరోయిన్‌గా ఇంత త్వరగా ఎంట్రీ ఇస్తానని ఆమె ఊహించలేదట. 'ధురంధర్' సినిమా కోసం ఆమె ఆడిషన్స్ ఇచ్చినప్పుడు, అది అంత పెద్ద ప్రాజెక్ట్ అని గానీ, అందులో తనే మెయిన్ లీడ్ అని గానీ ఆమెకు తెలియదట. ఆడిషన్స్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే దర్శక నిర్మాతలు అసలు విషయం చెప్పడంతో ఆమె కి తెలిసిందిట. చిన్నప్పటి నుంచి కెమెరా ముందు ఉండటం వల్ల నటన ఆమెకు సహజంగానే వచ్చింది.

బాలనటిగా విక్రమ్,ఇమ్రాన్‌ హష్మీ, సల్మాన్‌ ఖాన్, వంటి స్టార్లతో నటించిన అనుభవం, ఇప్పుడు హీరోయిన్‌గా తన బాధ్యతను మరింత పెంచిందని ఆమె వినమ్రంగా చెబుతోంది. బాలనటిగా ఉన్నప్పుడు ఎంతటి అమాయకత్వంతో ఆకట్టుకుందో, ఇప్పుడు హీరోయిన్‌గా కూడా అంతే పరిణతితో సారా అర్జున్ మెప్పిస్తోంది.