'ధురంధర్' బ్యూటీ పై టాలీవుడ్ 'ఐ'!
ఇటీవల రిలీజ్ అయిన `ధురంధర్` బ్లాక్ బస్టర్ అవ్వడంతో? హీరోయిన్ సారా అర్జున్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.
By: Srikanth Kontham | 27 Dec 2025 10:00 AM ISTఇటీవల రిలీజ్ అయిన `ధురంధర్` బ్లాక్ బస్టర్ అవ్వడంతో? హీరోయిన్ సారా అర్జున్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. సారా తెరపై కనిపించింది కాసేపే అయినా? ఓ మెరుపులా అలరించింది. సినిమా రిలీజ్ కు ముందు ఇద్దరి మధ్య వయసు వత్యాసం ..20 నటితో 40 నటుడు రొమాన్స్ ఏంటని? విమర్శలు వెల్లువెత్తినా? రిలీజ్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఎక్కడా కనిపించలేదు. ఆన్ స్క్రీన్ పై ఆ జోడీ అంత ఎబ్బెటుగానూ కనిపించలేదు. రణవీర్-సారా మధ్య కొన్ని కాంబినేషన్స్ సీన్స్ ఆదిధ్య ధర్ ఉన్నంతలో ఎంతో బ్యూటీఫుల్ గా చూపించాడు.
దీంతో రిలీజ్ తర్వాత విమర్శలకు తావు లేకుండా పోయింది. హీరోయిన్ గా సారా అర్జున్ తొలి చిత్రమిదే. అమ్మడు అన్ని భాషలకు తొలి హిట్ తోనే రీచ్ అయింది. ఏకంగా 1000 కోట్ల వసూళ్ల ప్రాజెక్ట్ లో భాగమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ బ్యూటీపై టాలీవుడ్ కన్ను పడిందా? అంటే అవుననే తెలుస్తోంది. సారా అర్జున్ ఇక్కడి యువ హీరోలకు పర్పెక్ట్ గా పెయిర్ అవుతుంది. అఖిల్, నాగచైతన్య, శర్వానంద్, రామ్, నితిన్ సహా వీళ్లకన్నా వయసు తక్కువ హీరోలకు పర్పెక్ట్ జోడీ అవుతుంది. అందం, అభినయం గల నాయిక. టాలీవుడ్ లో ఇలాంటి బ్యూటీలకు ఎనలేని క్రేజ్ ఉంటుంది.
హిందీ భాషల్ని మించి తెలుగు సహా దక్షిణాదిన ఇతర భాషల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంట్రీకి కూడా ఇదే సరైన సమయం. అయితే ఈ బ్యూటీకిప్పుడు బాలీవుడ్ లో మంచి అవకాశాలు రానున్నాయి. అక్కడి యంగ్ హీరోలు కూడా అమ్మడి కోసం పోటీ పడుతున్నారు. కరణ్ జోహార్ `ఐ` ఇంకా అటు వైపు ప్రసరించలేదు. లేదంటే ఇప్పటికే రెండు మూడు చిత్రాలకు లాక్ చేసేవాడు. సారా అర్జున్ టాలీవుడ్ డెబ్యూకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. గుణశేఖర్ స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తోన్న `యూఫోరియా` సినిమాతో సారా టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతుంది.
ఇదీ యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. గుణ శేరర్ చాలా కాలం తర్వాత ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షణ్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సారా అర్జున్ ఈ చిత్రాన్ని `ధురంధర్` కంటే ముందే సైన్ చేసింది. తాజాగా `ధురం ధర్` సక్సెస్ `యూఫోరియాకు` ప్లస్ అవుతుంది. సారా అర్జున్ ఇంపాక్ట్ కొంతైనా `యూఫోరియా`పై ఉంటుంది. అలాగే `ధురంధర్ 2` కూడా మార్చి 19న రిలీజ్ అవుతుంది. మరి `యూఫోరియా` ముందే రిలీజ్ అవుతుందా? `ధురంధర్ 2` రిలీజ్ అనంతరం ఉంటుందా? అన్నది చూడాలి.
