Begin typing your search above and press return to search.

సారా అర్జున్ హారోస్కోప్ ఏం చెబుతోంది?

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సెన్సేష‌న‌ల్ మూవీ `ధురంధ‌ర్ 2` ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

By:  Ravindar Gorantla   |   12 April 2026 8:00 AM IST
సారా అర్జున్ హారోస్కోప్ ఏం చెబుతోంది?
X

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సెన్సేష‌న‌ల్ మూవీ `ధురంధ‌ర్ 2` ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. గ‌త ఏడాది డిసెంర్‌లో విడుద‌లైన పార్ట్ 1కి మించి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టిస్తూ స‌రికొత్త రికార్డుల దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఫ‌స్ట్ పార్ట్ రూ.1350 కోట్లు రాబ‌డితే విడుద‌లైన అతి తక్కువ రోజుల్లోనే `ధురంధ‌ర్ 2` రూ.1658 కోట్ల‌కు పైగా రాబ‌ట్టి స‌రికొత్త రికార్డును సృష్టించింది. పెయిడ్ ప్రీమియ‌ర్స్‌తో రికార్డుల మోత‌కు తెర‌లేపిన `ధురంధ‌ర్ 2` వ‌రుస‌గా రికార్డుల్ని త‌న ఖాతాలో వేసుకుంటూ వెళుతోంది.

`గ‌ల్లీ బాయ్‌` త‌రువాత వ‌రుస ఫ్లాపుల్ని, డిజాస్ట‌ర్ల‌ని ఎదుర్కొన్న ర‌ణ్ వీర్ సింగ్ ఒక్క‌సారిగా `ధురంధ‌ర్‌` సీరీస్‌తో టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయాడు. అంతే కాకుండా స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ఈ సినిమా రోల్ మోడల్‌గా మార‌డంతో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్ ప‌రిస్థితి ఏంటే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. దేశంలోని ప్ర‌ముఖులు అంతా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ బెంచ్ మార్క్‌ని సెట్ చేశార‌ని ర‌ణ్‌వీర్ సింగ్‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌ల‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారు.

ప్ర‌స్తుతం రికార్డు స్థాయి వ‌సూళ్ల‌తో వ‌రుస రికార్డుల్ని తిర‌గ‌రాస్తున్న `ధురంధ‌ర్ 2` రానున్న రోజుల్లో అన్ బ్రేక‌బుల్ రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేసి సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసిన తార సారా అర్జున్‌. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సారాకు హీరోయిన్‌గా `ధురంధ‌ర్‌` ఫ‌స్ట్ మూవీ. తొలి సినిమాతోనే వేల కోట్ల క్ల‌బ్‌లో చేరిన హీరోయిన్‌గా సారా అర్జున్ స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంద‌ని బాలీవుడ్‌, టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఈ సంద‌ర్భంగా నెట్టింట సారా అర్జున్‌కు సంబంధించిన హోరో స్కోప్ అంటూ ఓ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. సారా బాలీవుడ్‌కు మ‌రో ఐశ్వ‌ర్య‌రాయ్ కాబోతోందంటూ ప్ర‌చారం చేస్తున్నారు. `బాద్ర‌పంచ్ మ‌హాపురుష్ యోగ‌, అన‌ఫా యోగ‌, న‌ల యోగ‌, ధ‌న్ యోగ‌, ప‌రాశ‌రీ రాజ్ యోగ‌, బుధ్ ఆదిత్య‌మోగ‌, వేశియోగ‌..ఇవ‌న్నీ సారా అర్జున్ జాత‌కంలో క‌లిసి ఉన్నాయ‌ని, ఇలా ఉండ‌టం రేర్ అని, ఆ కార‌ణం వ‌ల్లే సారాకు రాజ‌యోగం ప‌డుతోంద‌ని, రానున్న రోజుల్లో త‌ను బాలీవుడ్‌కు మ‌రో ఐశ్వ‌ర్య‌రాయ్‌గా నేయ్‌ని, ఫేమ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకుంటుంద‌ని అంటున్నారు. ఈ ప్ర‌చారం ఏమోగానీ ఫ‌స్ట్ మూవీతోనే వేల కోట్ల క్ల‌బ్‌లో చేరిన హీరోయిన్‌గా రికార్డు సాధించిన సారా బాలీవుడ్‌కు మ‌రో ఐశ్వ‌ర్య‌రాయ్ గా మార‌డం మాత్రం ప‌క్కా.