Begin typing your search above and press return to search.

అక్క‌డ సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ గా యంగ్ బ్యూటీ!

`సారా అర్జున్` పాన్ ఇండియాలో ఇప్పుడో సంచ‌ల‌నం. స్పై థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్` లో అమ్మ‌డు భాగ‌మ‌వ్వ‌డంతో ఈ రేంజ్ లో వెలిగిపోతుంది.

By:  Srikanth Kontham   |   13 Jan 2026 6:00 AM IST
అక్క‌డ సెంట్రాఫ్  అట్రాక్ష‌న్ గా యంగ్ బ్యూటీ!
X

`సారా అర్జున్` పాన్ ఇండియాలో ఇప్పుడో సంచ‌ల‌నం. స్పై థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్` లో అమ్మ‌డు భాగ‌మ‌వ్వ‌డంతో ఈ రేంజ్ లో వెలిగిపోతుంది. తొలి సినిమాతోనే 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిన న‌టిగా గుర్తింపు ద‌క్కించుకుంది. అమ్మ‌డి పాత్ర చిన్న‌దే అయినా? తెర‌పై క‌నిపించినంత సేపు ఆ పాత్ర‌కంటూ ఓ గుర్తింపు ఏర్ప‌డింది. సాధార‌ణంగా ఇలాంటి సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే ద‌ర్శ‌కులు చుట్టేస్తారు. కానీ ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ ఆ పాత్ర‌ను ఎంతో అందంగా చూపించాడు. పాత్ర‌లో ఎలాంటి అస‌భ్య‌త లేదు. సారాని తెర‌పై ఎంతో బ్యూటీపుల్గా మ‌లిచాడు`

తొలుత 40 ఏళ్ల వ‌య‌సున్న ర‌ణ‌వీర్ సింగ్ తో 18 ఏళ్ల సారా అర్జున్ న‌టించ‌డం ఏంట‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌హిళా సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. బాలీవుడ్ నుంచి కూడా కాస్త అసంతృప్తి వ్య‌క‌మ‌తైంది. కానీ వాటిని ఆదిత్య ధ‌ర్ ప‌ట్టించుకోలేదు. ర‌ణ‌వీర్ కు జోడీగా ప‌ర్పెక్ట్ బ్యూటీ సారా అని న‌మ్మి ముందుకెళ్లాడు. అనుకున్న‌ట్లుగానే గ్రాండ్ స‌క్సెస్ అయ్యాడు. ఆ పెయిర్ ని తెర‌పై ఎంతో అందంగా మ‌లిచాడు. సినిమా విడుద‌ల త త‌ర్వాత విమ‌ర్శించిన నోళ్ల‌న్ని మూత‌బ‌డ్డాయి. ఎవ‌రూ కిక్కురు మ‌న‌లేదు. ఇలా తొలి సినిమాతోనే 1000 కోట్ల వ‌సూళ్ల చిత్రంలో భాగ‌మైన మొట్టి మొద‌టి న‌టి సారా కావ‌డం విశేషం.

అతి పిన్న వ‌య‌సులో ఈ రికార్డు సాధించ‌డం మ‌రో విశేషం. ఇక `ధురంధ‌ర్ 2` హిట్ అయితే సారా ఇమేజ్ ఆకాశ న్నంట‌డం ఖాయం. ఈ విష‌యాన్ని బాలీవుడ్ లో కొంత మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ముందు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే సారాతో అగ్రిమెంట్లు చేసుకోవ‌డానికి నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారుట‌. ఓ నాలుగు సినిమాల‌కు సారా అర్జున్ కూడా సైన్ చేసింద‌ని ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. అందులో ఓ నిర్మాత‌ క‌ర‌ణ్ జోహార్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. మ‌రో బ్యాన‌ర్ య‌శ్ రాజ్ ఫిలింస్ అని వినిపిస్తోంది. మ‌రో రెండు బ్యాన‌ర్ల‌కు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సారా అర్జున్ క‌మిట్ మెంట్స్ కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే త‌ప్ప క్లారిటీ రాదు. ప్ర‌స్తుతం సారా అర్జున్ తెలుగులో కూడా ఓ సినిమాతో లాంచ్ అవుతోంది. గుణ శేఖ‌ర్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో `యూఫోరియా` అనే యూత్ పుల్ కాన్సెప్ట్ తో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో సారా అర్జున్ న‌టిస్తోంది. కానీ సారాకి పాన్ ఇండియాలో వ‌చ్చిన గుర్తింపును గుణ‌శేఖ‌ర్ మాత్రం స‌రిగ్గా వినియోగించుకోలేక‌పోతున్నారు. యూఫోరియా రిలీజ్ డిలే అవ్వ‌డం కూడా ఓ కార‌ణం కావొచ్చు. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. కానీ ఇంకా ల్యాబ్ లో నే ఉంది.