Begin typing your search above and press return to search.

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్‌గా బిజీగా మారింది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్స్ ఉన్న క్రాప్ టాప్, మ్యాచింగ్ స్కర్ట్‌లో ట్రెండీగా కనిపించింది. ఉంగరాల జుట్టు, సింపుల్ గోల్డ్ ఇయర్ రింగ్స్‌తో తన లుక్‌ను స్టైలిష్‌గా మార్చుకుంది. ‘ధురంధర్ 2’తో గుర్తింపు తెచ్చుకున్న సారా, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో వార్తల్లో నిలుస్తోంది.

By:  Madhu Reddy   |   7 Nov 2026 12:00 AM IST
మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!
X

సినీ ఇండ్రస్ట్రీ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందరినీ ఆకట్టుకుని, ఇప్పుడు హీరోయిన్‌గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సారా అర్జున్ ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన కొన్ని లేటెస్ట్ ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. సూర్యకాంతిలో మెరిసిపోతూ ఆమె ఇచ్చిన స్టైలిష్ పోజులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆ ట్రిప్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.





కలర్‌ఫుల్ అవుట్‌ఫిట్‌లో సారా లుక్స్:

మాల్దీవుల సముద్ర తీరంలో సారా అర్జున్ వేసుకున్న డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల బోల్డ్ అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్స్ ఉన్న స్లీవ్‌లెస్ క్రాప్ టాప్, మ్యాచింగ్ స్కర్ట్‌లో ఆమె చాలా ట్రెండీగా కనిపించింది. సన్నని స్ట్రాప్స్, హై వేస్ట్ డిజైన్ ఈ లుక్‌ను మరింత లైట్‌గా మార్చేశాయి. ఇక గాలికి ఎగురుతున్న ఉంగరాల జుట్టు, సింపుల్ గోల్డ్ ఇయర్ రింగ్స్, చేతికి వేసుకున్న గాజులతో ఆమె లుక్ చాలా క్లాసీగా ఉంది.





మాల్దీవుల వెకేషన్ మజా:

తన కుటుంబంతో 'ది స్టాండర్డ్ మాల్దీవ్స్' రిసార్ట్‌లో ఈ బ్యూటీ ప్రశాంతమైన క్షణాలను గడుపుతోంది. నీలి సముద్రం తీరంలో, ఇండోర్ ప్లాంట్స్ మధ్యలో నిలబడి పక్కకు చూస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఫ్యాషన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక "కొన్ని ప్రదేశాలు ప్రతి యాత్రను చాలా ప్రత్యేకంగా మారుస్తాయి" అంటూ ఆమె తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్స్‌ చూసిన ఫ్యాన్స్ "ఐలాండ్ ప్రిన్సెస్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.





సినిమాల పరంగా బిజీ బిజీ:

వెకేషన్‌తో పాటు సినిమాల పరంగా కూడా సారా అర్జున్ ఫుల్ బిజీగా ఉంది. రణ్‌వీర్ సింగ్ సరసన 'ధురందర్ 2' చిత్రంలో యాలినా పాత్రలో నటించి ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఇక ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న దిగ్గజ నటి మధుబాల బయోపిక్‌లో సారా టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రామ్ చరణ్ 'RC17' మూవీలోనూ ఆమె పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.





ఇక మొత్తంగా చుస్తే, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నేడు క్రేజీ హీరోయిన్‌గా ఎదుగుతున్న సారా అర్జున్, ఒకవైపు పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తూనే మరోవైపు ఇలాంటి ట్రెండీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ ఫాన్స్ ను అలరిస్తుంది.