ధురంధర్ ఎఫెక్ట్.. ఫస్ట్ హీరోయిన్ సారానే..
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 31 Dec 2025 7:25 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామాగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచిన ధురందర్.. రిలీజ్ అయ్యి 26 రోజులైనా ఇంకా దూసుకుపోతోంది.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు రూ.1100 కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఆ సినిమా.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా.. సెన్సార్ బోర్డు ఇచ్చిన ఏ సర్టిఫికెట్ తో రిలీజ్ అయ్యి రూ.1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన తొలి సినిమా కూడా నిలిచింది ధురంధర్.
అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించిన ఆమె.. ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. కేవలం 20 ఏళ్ల వయసులో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించిన తొలి హీరోయిన్ గా నిలిచింది.
ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రను పరిశీలిస్తే, వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఎక్కువగా తమ కెరీర్ మధ్య దశలో, అంటే మిడ్ 20స్ వయసులో ఉన్నవారే. కానీ సారా అర్జున్ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ, చాలా చిన్న వయసులోనే రూ.1000 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం విశేషమనే చెప్పాలి.
అయితే సారా అర్జున్ కు సినిమా ఇండస్ట్రీలో సందడి చేయడం కొత్త కాదు. బాలనటిగా ఆమె ఇప్పటికే పలు ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. చిన్న వయసులోనే తన యాక్టింగ్ లో నేచురాలిటీ, ఎమోషనల్ డెప్త్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సారా.. ఇప్పుడు హీరోయిన్ గా కూడా అదే స్థాయిలో తన టాలెంట్ తో ఫిదా చేసింది.
ధురంధర్ సినిమాలో ఆమె పాత్ర కథకు కీలకంగా నిలవడంతో పాటు.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా అందుకుంది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఆమె సొంతవ్వగా.. చాలా మంది సినీ విశ్లేషకులు యంగ్ బ్యూటీని నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోయిన్ గా అభివర్ణిస్తున్నారు. టాలెంట్ ఉంటే వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపించిందని అంటున్నారు.
చిన్న వయసులోనే పెద్ద ప్రాజెక్టులో అవకాశం అందుకోవడం, దానితో సక్సెస్ అందుకోవడం ఆమె కెరీర్ పై మరింత ఆశలు పెంచుతోంది. ప్రస్తుతం సారా అర్జున్ చేతిలో ఉన్న తదుపరి ప్రాజెక్టులపై కూడా ఆసక్తి నెలకొంది. ధురంధర్ ఇచ్చిన సక్సెస్ ఆమె కెరీర్ కు మైల్ స్టోన్ గా నిలవగా.. ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
