వధువు లుక్‌లో సారా అలీఖాన్.. గౌరవ్ గుప్తా డిజైన్స్‌తో మ్యాజిక్!
ఈ డిజిటల్ సిరీస్‌లో కేవలం దుస్తుల ప్రదర్శన మాత్రమే కాకుండా, సారా అలీ ఖాన్ వ్యక్తిత్వాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించారు.
By: Madhu Reddy | 13 Oct 2026 10:32 AM ISTబాలీవుడ్ అందాల తార సారా అలీ ఖాన్ ప్రస్తుతం తన స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సెలబ్రిటీ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన 'ది బ్రైడ్ సైడ్' సీజన్ 7 కోసం ఆమె ఒక అద్భుతమైన ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. గౌరవ్ గుప్తా సిగ్నేచర్ శైలి అయిన శిల్పకళా రూపాలు, సరికొత్త భారతీయ వధువు డిజైన్ల సమ్మేళనంతో కూడిన మూడు విభిన్న డ్రెస్ ల లో సారా మెరిసిపోయారు. ఆ విశేషాలు చూద్దాం.
సరికొత్తగా 'గౌరవ్ గుప్తా యూనివర్స్':
ఈ డిజిటల్ సిరీస్‌లో కేవలం దుస్తుల ప్రదర్శన మాత్రమే కాకుండా, సారా అలీ ఖాన్ వ్యక్తిత్వాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించారు. ప్రముఖ స్టైలిస్ట్ అమీ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇంటామెట్ కాన్వర్జేషన్‌లో సారా తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా యూనివర్స్‌లో వధువు యొక్క విభిన్న కోణాలను ఈ ఎపిసోడ్ ఎంతో అందంగా చూపించింది. అడ్రియన్ జాకబ్స్ మేకప్, ఆసిఫ్ అహ్మద్ హెయిర్ స్టైలింగ్ ఈ లుక్‌కు మరింత అందాన్ని తెచ్చాయి.
సినీ ప్రయాణం : సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కుమార్తె అయిన సారా, 2018లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన వచ్చిన 'కేదార్‌నాథ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఇక అదే ఏడాది రణ్‌వీర్ సింగ్‌తో 'సింబా' చిత్రంలో అలరించారు. ఆ తర్వాత 'లవ్ ఆజ్ కల్, 'అత్రంగి రే', 'జరా హట్కే జరా బచ్కే','మర్డర్ ముబారక్', 'ఏ వతన్ మేరే వతన్', అలాగే 'స్కై ఫోర్స్', 'మెట్రో... ఇన్ దినో', వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
సినిమాలతో ఫుల్ బిజీ:
సారా అలీ ఖాన్ కేవలం ఫ్యాషన్ వరల్డ్‌లోనే కాకుండా సినిమాల పరంగా కూడా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. ఇటీవల 'పతి పత్ని ఔర్ వో దో' సినిమాలో చంచల్ కుమారి పాత్రతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు తన రాబోయే సినిమాల ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియా-పాకిస్తాన్ నేపథ్యంతో కూడిన దేశభక్తి కామెడీ చిత్రం 'ఉడ్తా తీర్'లో ఆయుష్మాన్ ఖురానా సరసన ఆమె నటించారు. ఈ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది.
మోస్ట్ అవేటెడ్ 'గోల్మాల్ 5':
సినిమా కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న 'గోల్మాల్ 5'. ఈ పాపులర్ కామెడీ ఫ్రాంచైజీ చిత్రంలో సారా అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న 2027 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్స్ హడావుడి మధ్య సారా చేసిన ఈ బ్రైడల్ ఫొటోషూట్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఫ్యాషన్‌ను, సినిమా కెరీర్‌ను ఎంతో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న సారా అలీ ఖాన్ నయా లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
