సారా, ఓర్రీల మధ్య అసలేం జరిగింది?
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 31 Jan 2026 7:00 AM ISTబాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య వివాదం గురించి రోజుకో వార్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోనూ, గాసిప్ పోర్టల్స్ లో వస్తున్నాయి కానీ అందులో ఏదీ అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. ఈ నేపథ్యంలో ఓర్రీకి, సారా సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ కు మధ్య విభేధాలున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలన్నీ ఊహాజనితాలే తప్పించి, దీనిపై అటు ఒర్రీ కానీ, ఇటు సారా కానీ, ఇబ్రహీం కానీ మాట్లాడింది లేదు. పాలక్ తివారీతో ఇబ్రహీం డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది. గతంలో ఓ పార్టీలో జరిగిన సంఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది మరింత చర్చకు దారి తీసింది.
సారా, ఓర్రీ మధ్య మంచి స్నేహం
అయితే సారా అలీ ఖాన్, ఓర్రీ మధ్య ఒకప్పుడు మంచి స్నేహం ఉండేది. కానీ ఈ వివాదం వల్ల వారి రిలేషన్‌షిప్ క్రమంగా దెబ్బతింటూ వచ్చినట్టు కనిపిస్తోంది. దానికి తోడు ఓర్రీ రీసెంట్ గా సారా, అమృత సింగ్, పాలక్ పేర్లను ఇన్‌డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ పోస్ట్ చేసిన ఓ రీల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రీల్ ను చూసిన చాలా మంది ఓర్రీ కావాలనే వారిని రెచ్చగొడుతున్నారని భావిస్తున్నారు.
ఓర్రీ ఆ రీల్ ను పోస్ట్ చేసిన వెంటనే సారా అలీ ఖాన్ మరియు ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరూ వెంటనే సోషల్ మీడియాలో అతడిని అన్‌ఫాలో చేసినట్టు తెలిసింది. దీంతో ఈ వివాదం మరిన్ని కొత్త ఊహాగానాలకు తావిచ్చినట్టు అయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా, దీనిపై ఎవరైనా రియాక్ట్ అవుతారేమోనని ఫ్యాన్స్ చూస్తున్నారు.
