నేపోకిడ్స్‌తో పెట్టుకుని బుక్కయిన ఒర్రీ?
బాలీవుడ్ స్టార్ కిడ్స్ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ సోషల్ మీడియా ప్రభావశీలి ఒర్రీ మధ్య ఇటీవల జరిగిన గొడవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Sivaji Kontham | 27 Jan 2026 11:40 PM ISTబాలీవుడ్ స్టార్ కిడ్స్ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ సోషల్ మీడియా ప్రభావశీలి ఒర్రీ మధ్య ఇటీవల జరిగిన గొడవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి మధ్య ఉన్న స్నేహం ఒక్కసారిగా వికటించడానికి కారణాలు షాకిస్తున్నాయి.
అసలు ఈ గొడవకు కారణం ఏమిటో ఆరా తీస్తే తెలిసిన సంగతులివి. వీరి మధ్య గొడవ ఏదో పెద్ద వ్యక్తిగత కారణం వల్ల కాకుండా, ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ వల్ల మొదలైందని ఒర్రీ స్వయంగా వెల్లడించారు. ఒర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సారా అలీ ఖాన్‌తో జరిగిన చాట్‌ను షేర్ చేస్తూ ఆమెను దురంహకారి (రూడ్) అని కామెంట్ చేసాడు.
ఒక ఈవెంట్ గురించి సారా పంపిన మెసేజ్‌కు ఒర్రీ స్పందిస్తూ, ఆమె తనను చాలా చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. `చీప్`, `ఫేక్` అంటూ అతడు కామెంట్ చేసాడు. ఒర్రీ ఆరోపణల ప్రకారం.. సారా అలీ ఖాన్ తనను కేవలం ఫోటోల కోసం, సోషల్ మీడియా అటెన్షన్ కోసమే వాడుకుంటోందని ఆయన ఫీలయ్యారు. ``నువ్వు నన్ను నీ ఫ్రెండ్ అని చెప్పుకుంటావు కానీ.. నీ ప్రవర్తన మాత్రం చాలా దారుణంగా ఉంటుంది`` అని ఒర్రీ సారాను ఉద్దేశించి బహిరంగంగా వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత సీన్ లోకి ఇబ్రహీం వచ్చాడు. ఒర్రీ - ఇబ్రహీం అలీఖాన్ ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే సారా-ఒర్రీ గొడవలో ఇబ్రహీం తన సోదరి సారా పక్షాన నిలబడటంతో ఒర్రీకి, ఇబ్రహీంకి మధ్య కూడా దూరం పెరిగింది.
వీరిద్దరూ కలిసి ఉన్న పాత ఫోటోలను ఒర్రీ తన ప్రొఫైల్ నుండి తొలగించడం లేదా ఆర్కైవ్ చేయడంతో వారి మధ్య చెడిందని స్పష్ఠమైన సంకేతం వచ్చింది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. వీరు ప్రస్తుతం ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఒర్రీ తన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ, ``నేను ఎవరికైనా గౌరవం ఇస్తాను.. కానీ తిరిగి అది రానప్పుడు అక్కడ ఉండను`` అని స్పష్టం చేశారు. మరోవైపు సారా అలీ ఖాన్ ఈ వివాదంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఒకప్పుడు ప్రతి పార్టీలో కలిసి కనిపించిన ఈ ముగ్గురు, ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. బాలీవుడ్‌లో ఇలాంటి ఫ్రెండ్‌షిప్ బ్రేకప్స్ సర్వసాధారణమే అయినా, ఒర్రీ బహిరంగంగా చాట్స్ షేర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకరిపై ఒకరు పంచ్‌లు..
సారా వర్సెస్ ఒర్రీ సోషల్ మీడియా వార్ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఒర్రీ తనపై చేసిన బహిరంగ విమర్శలకు సారా నేరుగా స్పందించకుండా, ఒక పాట ద్వారా చాలా తెలివిగా, పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఒర్రీ తన వాట్సాప్ చాట్‌లను లీక్ చేస్తూ సారాను `రూడ్` అని కామెంట్ చేసాక, సారా తన ఇన్‌స్టాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ దానికి ఒక బాలీవుడ్ పాటను జత చేశారు. ఆ పాటలోని లిరిక్స్ ప్రకారం.. ``కుచ్ తో లోగ్ కహేంగే, లోగో కా కామ్ హై కెహనా...`` (ప్రజలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు.. అనడమే వారి పని) అని అర్థం వస్తుంది. ఈ పాట ద్వారా సారా చెప్పదలుచుకున్న సందేశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఒర్రీ ఆరోపణలను తాను పట్టించుకోవడం లేదని, అవన్నీ కేవలం పనిలేని వారు చేసే విమర్శలని సారా ఈ పాటతో పరోక్షంగా కొట్టిపారేశారు. అనవసర వివాదాల్లోకి దిగి తన స్థాయిని తగ్గించుకోదలచుకోలేదని, తన పని తాను చేసుకుపోతానని ఆమె హింట్ ఇచ్చారు. సారా ఇచ్చిన ఈ కౌంటర్ చూసి నెటిజన్లు తన పరిణతిని మెచ్చుకుంటున్నారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటూనే, గట్టిగా సమాధానం చెప్పడం సారా స్టైల్! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికి ఈ గొడవ తర్వాత సారా, ఆమె సోదరుడు ఇబ్రహీం ఇద్దరూ ఒర్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఒర్రీ ఇతర స్టార్ కిడ్స్ (జాన్వీ కపూర్, అనన్యా పాండే) తో కనిపిస్తున్నా, సారా వర్గంతో మాత్రం బంధం పూర్తిగా తెగిపోయినట్టే కనిపిస్తోంది.
