Begin typing your search above and press return to search.

గ్లామర్ ప్రపంచంలో మిడిల్ క్లాస్ మైండ్‌సెట్!

సారా స్నేహితులు సైతం ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాల నుంచే ఉండటం గమనార్హం. సారా అలీఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ..

By:  Srikanth Kontham   |   31 Oct 2026 6:00 PM IST
గ్లామర్ ప్రపంచంలో మిడిల్ క్లాస్ మైండ్‌సెట్!
X

బాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సెలబ్రిటీల జీవితాలు ఎంతో విలాసవంతంగా ఉంటాయని అంతా భావిస్తుంటారు. అయితే యువ నటి సారా అలీఖాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంటారు. స్టార్ కుటుంబం నుంచి వచ్చినా? ముంబై నగరంలో టెంపుల్స్, దర్గాల చుట్టూ తిరుగుతూ ఎంతో సింపుల్‌గా జీవించడం అమ్మ‌డి ప్రత్యేకత. సారా స్నేహితులు సైతం ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాల నుంచే ఉండటం గమనార్హం. సారా అలీఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ..

తల్లిదండ్రులు విడిపోయినా? తండ్రి నుంచి పూర్తి మ‌ద్ద‌తు ద‌క్కుతోంది. అయినా? చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ వాతావరణంలో పెరగడంతో సారా ఆలోచనలు ఎంతో ప్రాక్టికల్‌గా ఉంటాయి. పెద్ద సెలబ్రిటీ అయినా? ఆమె ప్రవర్తనలో ఎలాంటి గర్వం కనిపించదు. లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను గుడ్డిగా అనుసరించకుండా వాస్తవిక దృక్పథంతో జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సారా అలీఖాన్ పద్ధతిగా.. స్పష్టమైన ప్రణాళికతో అడుగులు వేస్తుంటారు.

విలాసవంతమైన ఖర్చుల విషయంలో పరిమితులు పాటిస్తారు. భవిష్యత్ అవసరాల కోసం చక్కగా సేవింగ్స్ చేసుకోవడంలో ముందుంటారు. సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఖర్చు చేయాలి? ఎంత దాచుకోవాలి ?అనే విషయాలపై సారాకు స్పష్టమైన అవగాహన ఉంది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి వచ్చిన అలవాటు కావడంతో.. ఆర్థిక విషయాల్లో సారా బాధ్యతాయుతమైన నిర్ణయాలే తీసుకుంటారు. ముంబైలోని బీచ్‌ల దగ్గర సమయం గడపడం, సాధారణ ప్రదేశాలకు వెళ్లడం సారాకు ఎంతో ఇష్టం. హంగు ఆర్భాటాలకు దూరంగా స్నేహితులతో కలిసి సాధారణ జీవితాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు.

ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా? నేల విడిచి సాము చేయకుండా అందరితో కలిసిపోయే నైజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన సంపాదనకు అవ‌కాశం ఉన్నా? అనవసరమైన ఖర్చులు చేసి డబ్బును వృథా చేయకూడదనే స్పష్టత సారుకు చాలా బ‌లంగా ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బును దాచుకుంటూ భవిష్యత్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ తరహా క్రమశిక్షణే నేటి యువతకు, భావి నటీమణులకు సారాను ఆదర్శంగా నిలబెడుతుంది. మొత్తం మీద గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా మూలాలను మరిచిపోని వ్యక్తిత్వం సారా అలీఖాన్‌ది. మిడిల్ క్లాస్ వాతావరణం నేర్పిన పొదుపు సూత్రాలను పాటిస్తూ ఆర్థికంగా ఎంతో పరిణతితో వ్యవహరించి తీరు చూసి యువ‌త‌కు మంచి రోల్ మోడ‌ల్ గా చెప్పొచ్చు.