ఎడారిలో అందాలతో ఆకట్టుకుంటున్న స్టార్ కిడ్..
ఇదిలా ఉండగా తాజాగా ఒక స్టార్ కిడ్ కూడా ఎడారిలో సందడి చేస్తూ తన అందాలతో ఆకట్టుకుంటుంది మరి ఆమె ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 2 Nov 2025 1:00 AM ISTప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అటు ఇండస్ట్రీలోకి రావాలని ఉన్న కొత్త నటీనటులే కాదు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న సెలబ్రిటీలు కూడా యాక్టివ్ అయిపోతున్నారు. అలాగే స్టార్ సెలబ్రిటీల వారసులు కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక స్టార్ కిడ్ కూడా ఎడారిలో సందడి చేస్తూ తన అందాలతో ఆకట్టుకుంటుంది మరి ఆమె ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఆమె ఎవరో కాదు సారా అలీ ఖాన్.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ కుమార్తె. కొలంబియా యూనివర్సిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్న ఈమె తన నటన జీవితాన్ని 2018లో ప్రారంభించింది.. ఆ ఏడాది వచ్చిన రొమాంటిక్ డ్రామా కేదార్నాథ్, యాక్షన్ కామెడీ సింబాలతో ప్రారంభించింది. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇకపోతే ఉత్తమ మహిళ అరంగేట్రానికి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉండగా తాజాగా వెకేషన్ కి వెళ్ళిన ఈమె అటు ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సారా అలీ ఖాన్.. ఆ తర్వాత ఎడారిలో తన స్నేహితులతో కలిసి సందడి చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేసింది. అలాగే సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సారా అలీ ఖాన్ ను ఈ గెటప్ లో చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
సారా అలీ ఖాన్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..
ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వంలో ఆదిత్య రాయ్ కపూర్ నటించిన మెట్రో ఇన్ డినో సినిమాలో నటించింది. అలాగే ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో ఒక ప్రాజెక్టు చేస్తున్న ఈమె ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. అలాగే సిద్ధార్థ మల్హోత్రాలతో కూడా ఒక ప్రాజెక్టు చేస్తోంది. ఇది గ్రామీణ జానపద కథ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఈ సినిమా నిర్మాణం కూడా ప్రారంభమైనట్లు సమాచారం. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలబడలేదు. తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఒక సినిమాలో కూడా ఈమె భాగమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పతీ పత్నీ ఔర్ ఓ దో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. అలాగే రణవీర్ సింగ్, రోహిత్ శెట్టి కాంబినేషన్లో వస్తున్న ఒక సినిమా ఆకాష్ కోషిక తో మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.
