Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ – సప్తగిరి వ్యాఖ్యలపై క్లారిటీ!

మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజా సాబ్' ఏకంగా రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విజువల్ వండర్. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ నటిస్తున్న సినిమాను చిన్న సినిమా అనడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది.

By:  Madhu Reddy   |   11 May 2026 12:00 AM IST
ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ – సప్తగిరి వ్యాఖ్యలపై క్లారిటీ!
X

టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపాయి. తన కొత్త సినిమా 'పురుషః' ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'ది రాజా సాబ్'ను చిన్న సినిమాల లిస్టులో చేర్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆయన కావాలని అనలేదని, మాటల ప్రవాహంలో అలా వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. అసలు సప్తగిరి ఏమన్నారు? దీనిపై వస్తున్న రియాక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

ప్రభాస్ మూవీ 'చిన్న' సినిమానా?:

మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజా సాబ్' ఏకంగా రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విజువల్ వండర్. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ నటిస్తున్న సినిమాను చిన్న సినిమా అనడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రెస్ మీట్‌లో సప్తగిరి మాట్లాడుతూ.. "నేను ఇటీవల సరస్వతి, రాజా సాబ్, పురుష వంటి చిత్రాల్లో నటించాను. అవి చిన్న స్థాయి సినిమాలు కావడంతో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ అవ్వలేదు, కానీ నేను మూవీస్ కంటిన్యూ గా చేస్తున్న అని" వ్యాఖ్యానించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఫ్లోలో జరిగిన పొరపాటా:

సప్తగిరి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తే, ఆయన ప్రభాస్ సినిమాను తక్కువ చేయాలనే ఉద్దేశంతో అన్నట్లు అనిపించడం లేదు. తను వరుసగా చేస్తున్న సినిమాల గురించి చెబుతూ, ఫ్లోలో ఆ పేరు కూడా వాడేసినట్లు కనిపిస్తోంది. ఒక కమెడియన్‌గా ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండే సప్తగిరి, అంత పెద్ద ప్రాజెక్టును తక్కువ చేయరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

'పురుషః' పైనే సప్తగిరి ఫోకస్:

ప్రస్తుతం సప్తగిరి తన తదుపరి చిత్రం 'పురుషః' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సప్తగిరితో పాటు వెన్నెల కిషోర్ కూడా నటిస్తుండటంతో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. జూన్ 22న విడుదల కానున్న ఈ సినిమా గ్లింప్స్ మరియు టీజర్స్ ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేశాయి.

క్లారిటీ ఇచ్చే ప్రయత్నం:

ఇక కొందరు సప్తగిరి ఉద్దేశం అది కాదని, ఆయన కేవలం తన సినిమాల రిలీజ్ మరియు పబ్లిసిటీ గురించి సాధారణంగా మాట్లాడారు తప్ప, ప్రభాస్ క్రేజ్‌ను కానీ, సినిమా బడ్జెట్‌ను కానీ ఉద్దేశించలేదు. ఏదేమైనా ఒక చిన్న మాట ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారి, సినిమా ప్రమోషన్స్‌కు అనూహ్యమైన పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.

సప్తగిరి వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టినా అది కేవలం మాట పొరపాటే అని సర్దుకుపోవడం మంచిది అని ఫ్యాన్స్ భావించాలని కొందరు కోరుతున్నారు.ఇక ఆయన నటించిన 'పురుషః' జూన్ 22న బాక్సాఫీస్ వద్దకు రాబోతోంది. కొత్త హీరో పవన్ కళ్యాణ్ బత్తులకి ఈ సినిమా ఎలాంటి గుర్తింపు తెస్తుందో, సప్తగిరి-వెన్నెల కిషోర్, కాంబో మనల్ని ఎంతలా నవ్విస్తుందో చూడాలి