Begin typing your search above and press return to search.

బికినీ షాట్ లో సెగలు పుట్టిస్తున్న దంగల్ బ్యూటీ!

అందులో భాగంగానే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా పంచుకున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   27 May 2026 4:04 PM IST
బికినీ షాట్ లో సెగలు పుట్టిస్తున్న దంగల్ బ్యూటీ!
X

అమాయకపు చూపులతో.. గ్లామర్ అందాలతో కుర్రకారు హృదయాలను దోచుకునే సాన్య మల్హోత్రా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అమీర్ ఖాన్ ప్రధానోపాత్రలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన దంగల్ సినిమాలో కీలక పాత్ర పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఈ ఒక్క సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత పలు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న సాన్యా.. ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సెగలు పుట్టించే రేంజ్ లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

అందులో భాగంగానే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా పంచుకున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బికినీనీ ధరించిన ఈమె ఈ అందాలను మరింత ఎలివేట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. చిన్న కోట్ ధరించి కొన్ని ఫోటోలలో అందాలు దాచేసిన ఈమె.. మరికొన్ని ఫోటోలలో గ్లామర్ ప్రదర్శన చేసి సోషల్ మీడియాలో మంట రాజేసింది. అటు భిన్నమైన ఫోజులకు నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాన్యా మల్హోత్ర లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.

సాన్యా మల్హోత్రా 1992 ఫిబ్రవరి 25న ఢిల్లీలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది. గార్గి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న ఈమె బ్యాలేలో డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. గార్గి కాలేజీ నుండి పట్టబద్రురాలైన ఈమె.. డాన్స్ ఇండియా డాన్స్ అనే డాన్స్ రియాల్టీ షోలో పాల్గొని టాప్ 100 జాబితాలోకి ప్రవేశించింది. ఇక ముంబైకి మకాం మార్చిన తర్వాత టెలివిజన్ వాణిజ్య ప్రకటనల కోసం కెమెరామెన్ లకు సహాయకురాలిగా పనిచేసిన సాన్యా.. ఆ తర్వాత తొలిసారి నితీష్ తివారి బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా దంగల్ కోసం ఫాతిమా షేక్ తో పాటు ఈమెను కూడా ఎంపిక చేశారు. ఈ సినిమాలో రెజ్లింగ్ పాత్ర కోసం ఎంతో కఠినమైన శిక్షణ కూడా తీసుకుంది సాన్యా.

ఇక ఈమె నటిగానే కాకుండా 2017 లో వచ్చిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా కోసం సెక్సీ బలియే అనే పాటకు కొరియోగ్రఫీ కూడా అందించింది. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నటనా రంగంలోకి అడుగు పెట్టింది.. 2018లో వచ్చిన పటాకా అనే సినిమాలో నటించిన ఈమె ఇక తర్వాత వరుస పెట్టి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. సినిమాలే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా మారింది. ఇక మొత్తానికైతే సాన్యా తన నటనతోనే కాదు ఇటు పలు విభాగాలలో అవార్డులు కూడా దక్కించుకుంది.

2018లో వచ్చిన దంగల్ సినిమాకు ఉత్తమ నూతన యాక్షన్ ప్రదర్శకురాలి విభాగంలో జాకీ చాన్ యాక్షన్ మూవీ అవార్డును దక్కించుకుంది. కథల్ అనే సినిమాకు 2023 ఫిలింఫేర్ ఓటిటి అవార్డ్స్ లో భాగంగా వెబ్ ఒరిజినల్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకుంది. న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్, ఐకానిక్ గోల్డ్ అవార్డు, బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ అవార్డులను కూడా దక్కించుకుంది సాన్యా.