క్రేజీ కాన్సెప్ట్‌తో 'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్.. యూత్‌కి కిక్కెక్కించే ప్రేమకథ!
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ వైబ్ క్రియేట్ చేస్తోంది.
By: M Prashanth | 2 Feb 2026 5:36 PM ISTఅశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ వైబ్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. మొదట ఒక హాస్టల్ దగ్గర హీరో హీరోయిన్లు పరిచయం కావడం, ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి లివింగ్ టుగెదర్ వరకు వెళ్లడం వంటి సీన్లు నేటి తరం ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయి. ఒకవైపు కెరీర్ టెన్షన్లు, మరోవైపు పర్సనల్ లైఫ్ మధ్య నలిగిపోయే కుర్రాడి ప్రయాణమే ఈ గాబరా గాబరా స్టోరీ.
సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఇందులో కేవలం సరదా మాత్రమే కాదు.. లోతైన ఎమోషన్ కూడా కనిపిస్తోంది. మొదట వీరు ఎలా కలిశారు, ఆ తర్వాత కలిసి జీవించే క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి అనేది ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు. ముఖ్యంగా లివింగ్ కే ఛాన్స్ లేనోడ్ని లివింగ్ టుగెదర్ లైఫ్ బతికేస్తా అన్న డైలాగ్ హీరో పాత్ర స్థితిని తెలియజేస్తోంది. సరదాగా సాగిపోయే వీరి జీవితంలోకి రొమాన్స్, ఆ తర్వాత వచ్చే గందరగోళం ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.
వీరిద్దరి ప్రేమ ప్రయాణం ఒక ఎత్తైతే, ఆ విషయాన్ని పేరెంట్స్ కు చెప్పి వారిని ఒప్పించే క్రమంలో వచ్చే డ్రామా మరో ఎత్తు. పెళ్లి గురించి మీ నాన్న చాలా కోపంగా ఉన్నాడు అని తల్లి చెప్పే మాటలు, అబ్బాయి ఫ్యామిలీతో కలిసి కూర్చున్న సీన్లు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా గట్టిగానే ఉంటాయని హింట్ ఇస్తున్నాయి. నా కూతురికి మంచి సంబంధం చూశాం అని తండ్రి చెప్పే డైలాగ్ ఈ ప్రేమకథలో వచ్చే మలుపులను ఆసక్తికరంగా మార్చింది.
ట్రైలర్ లోని డైలాగ్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. లవ్ ఛాయిసో, నీడో నాకు తెలియదు.. ఫేట్ అని మాత్రం తెలుసు. అది రావాలనుకుంటే నో చెప్పే ఛాన్స్ ఉండదు.. అంటూ సంతోష్ శోభన్ చెప్పే డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే మనిషికి హోప్ ఉండాలి, అది ఎప్పుడైనా నాకు ఇచ్చావా? అని హీరోయిన్ అడిగే ప్రశ్నలు వీరి మధ్య ఉన్న బాండింగ్ ను ఎలివేట్ చేస్తున్నాయి. రాకేందు మౌళి అందించిన సాహిత్యం, ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ కానున్నాయని అనిపిస్తుంది.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో అజయ్ కుమార్ రాజు.పి నిర్మించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్ తన కెరీర్ లోనే ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేసినట్టు కనిపిస్తోంది. మానస వారణాసితో అతని కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా ఉంది. గాబరా గాబరా సాంగ్ ఇప్పటికే పాజిటివ్ గా ట్రెండ్ అవుతోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ప్రస్తుత జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది.
దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఒక క్లీన్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ ను మన ముందుకు తీసుకువస్తున్నట్లు ట్రైలర్ టాక్ ను బట్టి అర్థమవుతోంది. ఆఫీస్ టెన్షన్లు, ట్రాఫిక్ కష్టాలు వంటి రోజువారీ ఇబ్బందులను కూడా సరదాగా చూపిస్తూనే, ఒక అందమైన ప్రేమకథను ఇందులో పొందుపరిచారు. వాలెంటైన్స్ డేకి థియేటర్లలో ఈ కపుల్ ఫ్రెండ్లీ స్టోరీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
