Begin typing your search above and press return to search.

సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ'.. టార్గెట్ ఫిక్స్!

ఇప్పుడు అదే పట్టుదలతో "కపుల్ ఫ్రెండ్లీ" అనే కొత్త ప్రాజెక్ట్ తో మన ముందుకు వస్తున్నారు.

By:  M Prashanth   |   7 Jan 2026 1:49 PM IST
సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ.. టార్గెట్ ఫిక్స్!
X

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా ఆయన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. టాలెంట్ పుష్కలంగా ఉన్నా సక్సెస్ విషయంలో మాత్రం ఆయనకు సరైన టైమ్ కలిసి రావడం లేదు. ఎంత కష్టపడుతున్నా ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్ దక్కకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇప్పుడు అదే పట్టుదలతో "కపుల్ ఫ్రెండ్లీ" అనే కొత్త ప్రాజెక్ట్ తో మన ముందుకు వస్తున్నారు.





ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూవీ లాంటి పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉండటం ఈ ప్రాజెక్ట్ కి ఒక బలంగా మారింది. సంతోష్ శోభన్ లాంటి టాలెంటెడ్ నటుడికి ఇలాంటి సపోర్ట్ తోడవ్వడం వల్ల ఈసారి ఫలితం పాజిటివ్ గా ఉంటుందని ఆశిస్తున్నారు.





"కపుల్ ఫ్రెండ్లీ" అనే టైటిల్ చూస్తుంటేనే ఇది కంప్లీట్ గా నేటి యూత్ కి కనెక్ట్ అయ్యే కథ అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో కనిపిస్తున్న హీరో హీరోయిన్ల లుక్స్ చాలా నేచురల్ గా ఉండి సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

సినిమాలో సంతోష్ సరసన హీరోయిన్ గా మానస వారణాసి నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. లవ్ స్టోరీ కాబట్టి రిలీజ్ కోసం వాలెంటైన్స్ డే నే సరైన సమయంగా మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఆదిత్య రవీంద్రన్ సంగీతాన్ని అందిస్తుండగా గణేష్ శివ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

తెలుగు తో పాటు తమిళ భాషల్లో కూడా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. యూత్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేలా మేకర్స్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. సంతోష్ శోభన్ నటన పరంగా ఎప్పుడూ తన వంతు కృషి చేస్తున్నారు. కథల ఎంపిక బాగున్నా రిజల్ట్ విషయంలో మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. మరి ఈసారి వాలెంటైన్స్ డే కి వస్తున్న "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ఆయనకు ఆశించిన బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.