'సంతాన ప్రాప్తిరస్తు'.. కొత్త లవ్ స్టోరీలో ఫుల్ ఫన్, కాస్త ఎమోషన్!
నెక్స్ట్ బాక్సాఫీస్ వద్ద కొన్ని ఆసక్తికరమైన చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో 'సంతాన ప్రాప్తిరస్తు' కూడా ముందు నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
By: M Prashanth | 6 Nov 2025 5:58 PM ISTనెక్స్ట్ బాక్సాఫీస్ వద్ద కొన్ని ఆసక్తికరమైన చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో 'సంతాన ప్రాప్తిరస్తు' కూడా ముందు నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు, చూస్తుంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది.
ట్రైలర్ మొదలవ్వడమే.. దేవర కథ ప్రకాష్ రాజ్ చెప్తే వినలేదా అనే డైలాగ్ తో, సినిమాపై ఒక ఫన్ వైబ్‌ను క్రియేట్ చేశారు. ఆ తర్వాత, హీరో హీరోయిన్ల మధ్య క్యూట్ లవ్ స్టోరీ, వారి పెళ్లి, కొత్తగా పెళ్లయిన జంట మధ్య ఉండే రొమాన్స్‌ను చూపించారు. కానీ, కథ అక్కడే ఆగదు.
ఈ ప్రేమకథలో అసలు సమస్య సంతానం లేకపోవడం. ట్రైలర్ నెమ్మదిగా ఫన్ నుంచి ఎమోషనల్ డ్రామాలోకి మారుతుంది. "మీ రిపోర్ట్స్ చూశాను, మీ స్పెర్మ్ కౌంట్ కొంచెం తక్కువగా ఉంది" అని డాక్టర్ చెప్పే డైలాగ్‌తో కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్‌ను రివీల్ చేశారు. పిల్లలు పుట్టడం కోసం ఈ జంట పడే పాట్లు, ఫ్యామిలీ ఒత్తిడి, డాక్టర్ బ్రహ్మారం (వెన్నెల కిషోర్) వెల్నెస్ సెంటర్‌లోని కామెడీ సీన్స్ కామెడీగా ఉన్నాయి.
"ముప్పై వేలా? ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంటే పిల్లలు పుట్టడానికా, పెంచడానికా అన్నట్లుంది", "చెప్పిన మాట వినని వాడినే కొడుకు అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు" వంటి గరికపాటి డైలాగ్స్ ఫన్‌ను జనరేట్ చేశాయి. మరోవైపు, "నీకున్నది స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లమ్, మీకున్నది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్" వంటి డైలాగ్స్ కథలోని సీరియస్‌నెస్‌ను, ఎమోషన్‌ను చూపిస్తాయి.
ట్రైలర్ చూస్తుంటే, దర్శకుడు సంజీవ్ రెడ్డి ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని, దానికి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. విక్రాంత్, చాందినీ చౌదరిల కెమిస్ట్రీ ఫ్రెష్‌గా ఉంది. సునీల్ కశ్యప్ సంగీతం, అజయ్ అరసద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈ సినిమా థియేటర్లలో నవ్వులతో పాటు, భావోద్వేగాలను కూడా పండిస్తుందని ట్రైలర్ హింట్ ఇస్తోంది. నవంబర్ 14న విడుదల కానున్న ఈ చిత్రం, ఈ వారాంతంలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి ఆప్షన్‌గా నిలిచేలా ఉంది. మరి కంటెంట్ ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.
