Begin typing your search above and press return to search.

'సంతాన ప్రాప్తిరస్తు' కొత్త ప్రోమో చూశారా? అన్ లిమిటెడ్ నవ్వులు

టాలీవుడ్ యువ నటీనటులు విక్రాంత్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు.

By:  M Prashanth   |   21 Oct 2025 3:37 PM IST
సంతాన ప్రాప్తిరస్తు కొత్త ప్రోమో చూశారా? అన్ లిమిటెడ్ నవ్వులు
X

టాలీవుడ్ యువ నటీనటులు విక్రాంత్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు మూవీని మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మొత్తం షూటింగ్ ను పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. అవి కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి చేయనున్నారు.

బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ డోస్ కు రెడీ అవ్వండంటూ క్యాప్షన్ ఇచ్చిన మేకర్స్.. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోమని సరదాగా పిలుపునిచ్చారు. ఫన్నీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజ్ డేట్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. లవ్, తక్కువ వీర్యకణాల సంఖ్య, హై డ్రామా, అన్ లిమిటెడ్ నవ్వులు.. ప్రేమ సంతానోత్పత్తి గురించి కాదు... భావాల గురించి నిరూపించే రొమాంటిక్- కామ్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రిలీజ్ ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటోంది.

ప్రస్తుత సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక దానిని తీసుకుని సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా.. మేకర్స్ రిలీజ్ ప్రోమోతో మరింత స్పష్టత ఇచ్చారు. ప్రోమో ప్రకారం, హైదరాబాద్ లో హీరో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తుంటారు. ఆ సమయంలో ఫుల్ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తారు.

ఆ తర్వాత హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటారు. కానీ పిల్లలు కనే టైమ్ లో సమస్య వస్తుంది. దీంతో డాక్టర్ ను ఆశ్రయించగా.. స్పెర్మ్ కౌంట్ తక్కువ అని చెబుతారు. దీంతో వంద రోజుల్లో ప్రెగ్నెంట్ చేయాలని అనుకుంటారు. అప్పుడే వెన్నెల కిషోర్ హీరోకు కొన్ని టిప్స్ ఇస్తారు. మరి చివరకు ఏమైంది? హీరో అనుకున్న సాధించారా? అనేది మూవీగా ప్రోమో ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. పోస్టర్లు, ప్రోమోలు అన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మూవీ క్లిక్ అవుతుందనే హోప్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు తాజాగా ప్రోమో వాటిని మరింత పెంచింది. మరి సంతాన ప్రాప్తిరస్తు మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.