పిల్లలు లేరని ప్రెషరా? సాఫ్ట్‌వేర్ జంటల కష్టాలపై వస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు'!
స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్. జి. మాట్లాడుతూ.. "జనాభాలో మనం చైనాను దాటేశాం, ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్నాం.
By: M Prashanth | 27 Oct 2025 4:46 PM ISTవిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు". ఈ చిత్రం నుంచి 'తెలుసా నీకోసమే' అనే అందమైన లిరికల్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే అందించారు. "ఆయ్", "సేవ్ ది టైగర్స్" వంటి హిట్స్‌కు పనిచేసిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. శ్రీమణి లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ ఎంతో ఫీల్‌తో పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడారు.
స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్. జి. మాట్లాడుతూ.. "జనాభాలో మనం చైనాను దాటేశాం, ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్నాం. కానీ అదే సమయంలో ఐవీఎఫ్, ఫర్టిలిటీ సెంటర్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ కాంట్రాస్ట్ పాయింట్‌ను తీసుకుని, ఎంటర్‌టైనింగ్ పద్ధతిలో రాసుకున్న కథ ఇది. 'సంతాన ప్రాప్తిరస్తు' ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి ఎంటర్‌టైనర్. వినోదం గ్యారెంటీ. మీ సపోర్ట్ కావాలి" అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ.. "వరుసగా 'ఆయ్', 'సేవ్ ది టైగర్స్', 'త్రీ రోజెస్' లాంటి ఎంటర్‌టైనర్స్ చేస్తున్నా. ఆ టైమ్‌లో శ్రీధర్ గారు ఈ సినిమా చూపించి బీజీఎం చేయమన్నారు. మూవీ చూస్తున్నంతసేపూ చాలా ఆర్గానిక్‌గా అనిపించింది. అలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడే 'తెలుసా నీకోసమే' ట్యూన్ పుట్టింది. ఇది బీజీఎం నుంచి వచ్చిన పాట. శ్రీమణి బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు, అర్మాన్ మాలిక్ ప్రాణం పోశారు" అన్నారు.
ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. "ఒకవైపు అత్యధిక జనాభా, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు.. ఈ పాయింట్ నుంచే మా కథ మొదలైంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ లాంటి బిజీ ప్రొఫెషనల్స్ జీవితాల్లో పిల్లలు పుట్టకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సోషల్ పాయింట్‌ను ఎక్కడా వల్గారిటీ లేకుండా, ఫ్యామిలీ అంతా చూసేలా ఫన్‌తో చెప్పాం. మా క్లోజ్ సర్కిల్ అంతా సినిమా బాగుందన్నారు. చిన్న సినిమాల రిలీజ్ కష్టాలు తెలిసినా, మాకు సురేష్ ప్రొడక్షన్స్ ధైర్యం ఉంది. మా సినిమాలన్నీ వాళ్లే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈసారి నిరాశపరచమని సురేష్ బాబు గారికి మాటిచ్చా. టీజర్, ట్రైలర్ ఆయనకు నచ్చాయి. ఇది ఒక కాంటెంపరరీ ఎంటర్‌టైనర్. 'తెలుసా నీకోసమే' పాట కథలోంచి వచ్చింది, ఖచ్చితంగా చాట్‌బస్టర్ అవుతుంది. విక్రాంత్ చాలా మంచి పెర్ఫార్మర్, ఈ కథకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. చాందినీ, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ అందరూ బాగా చేశారు. మరో మూడు వారాల్లో మీ ముందుకు వస్తున్నాం" అన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. "సమాజంలో జంటలు ఫేస్ చేస్తున్న ఓ సమస్యను తీసుకున్నాం. కానీ ఎక్కడా హార్డ్ హిట్టింగ్ మెసేజ్‌లు ఉండవు. అంతా ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో వెళ్తుంది. నిర్మాతలు శ్రీధర్ గారు, హరిప్రసాద్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. హీరో విక్రాంత్ ఈ సినిమాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, రియలిస్టిక్ మేకోవర్‌లో కనిపిస్తాడు, మాకు బాగా సపోర్ట్ చేశాడు. అజయ్ గారు బీజీఎం నుంచి ఈ సాంగ్ ఇవ్వడం చాలా బాగుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఇందులో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. నా టీమ్ అందరికీ థ్యాంక్స్" అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. "కథ వినగానే చాలా హ్యాపీగా అనిపించింది. సొసైటీలోని ఒక బర్నింగ్ ఇష్యూను మెసేజ్‌లు ఇవ్వకుండా లైట్ హార్టెడ్‌గా చెప్పారు. పిల్లలు లేని కపుల్స్ పడే మానసిక ఒత్తిడి, ఎమోషన్ కూడా సినిమాలో ఉంటుంది. నా నటనకు పేరొస్తే దానికి కారణం మా దర్శకుడు సంజీవ్ రెడ్డి గారే. నిర్మాతలకు థ్యాంక్స్. అజయ్ అరసాడ తన బీజీఎంతో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. 'తెలుసా నీకోసమే' నా ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్. శ్రీమణి, అర్మాన్ మాలిక్ చాలా బాగా చేశారు. చాందినీ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ వ్యాల్యూస్‌తో, ఎక్కడా అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా చూసే సినిమా ఇది. నవంబర్ 14న వస్తున్నాం, దయచేసి ఆదరించండి" అన్నారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. "'సంతాన ప్రాప్తిరస్తు' టీమ్‌కు ఆల్ ది బెస్ట్. మధుర శ్రీధర్ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా, సినిమాపై చాలా ప్యాషన్‌తో ఉంటారు. ఆయన ప్రయత్నాలు ఎప్పుడూ విఫలం కాలేదు. పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్‌కి కంగ్రాట్స్. ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అన్నారు.
