Begin typing your search above and press return to search.

సంతాన ప్రాప్తిరస్తు పబ్లిక్ టాక్ ఏంటి..?

వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే స్టార్ సినిమాలే కాదు వెరైటీ కంటెంట్ తో వచ్చే చిన్న సినిమాలు అదే లో బడ్జెట్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు.

By:  Ramesh Boddu   |   15 Nov 2025 12:00 PM IST
సంతాన ప్రాప్తిరస్తు పబ్లిక్ టాక్ ఏంటి..?
X

వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే స్టార్ సినిమాలే కాదు వెరైటీ కంటెంట్ తో వచ్చే చిన్న సినిమాలు అదే లో బడ్జెట్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రధానంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనే ప్లాన్ తో వచ్చే సినిమాలకు ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. అందుకే చిన్న సినిమాలన్నీ ప్రధానంగా కామెడీని బేస్ చేసుకునే చేస్తుంటారు. ఈ విధంగానే లాస్ట్ వీక్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ వారం మరో సినిమా సంతాన ప్రాప్తిరస్తు సినిమా వచ్చింది. సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు క్రిటిక్స్ దగ్గర నుంచి మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమాకు పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో చూద్దాం..

ఎంచుకున్న పాయింట్ దాన్ని నడిపించిన తీరు..

సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో నటించారు. సినిమా టైటిల్ కు తగినట్టుగానే పిల్లలు పుట్టరనే ప్రాబ్లం ఉన్న హీరో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వచ్చే సమస్యలతోనే ఈ సినిమా కథ కథనం నడుస్తుంది. ఐతే ఎంచుకున్న పాయింట్ దాన్ని నడిపించిన తీరు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ వీక్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉందని ఆడియన్స్ రియాక్షన్ ఉంది.

ఫ్యామిలీ ఆడియన్స్ ఓ సినిమాను బాగుంది అంటే అది కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఐతే ఈ వారం రిలీజైన సినిమాల్లో ఎక్కువగా ఎంటర్టైనింగ్ గా ఉంది కాబట్టి సంతాన ప్రాప్తిరస్తు సినిమాకే ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉంది. పోటీగా వచ్చిన సినిమాలు వెరైటీ కథ కావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సంతాన ప్రాప్తిరస్తు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఐతే సినిమాలో అక్కడక్కడ కాస్త ట్రాక్ తప్పినా వారు పెట్టిన టికెట్ కి వర్త్ వాచింగ్ అనిపించేలా ఈ సినిమా ఉందని అంటున్నారు. అంతేకాదు సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కూడా సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాలో లీడ్ పెయిర్ తో పాటు వెన్నెల కిషోర్ కామెడీ, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం కూడా బాగా ఎంటర్టైన్ చేశారు.

క్లైమాక్స్ లో ఎమోషన్ అయితే వర్క్ అవుట్..

ఇక సినిమాకు ఏదైతే బలంగా ఉండాల్సిన క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా కొంతమేరకు ఆడియన్స్ ని మెప్పించింది. అందుకే సంతాన ప్రాప్తిరస్తు ఈ వారం రిలీజైన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అయ్యే ఛాన్స్ ఉందని ఆడియన్స్ చెబుతున్నారు. ఐతే సినిమాలో కొన్ని విషయాల్లో అక్కడక్కడ గాడి తప్పినా ఓవరాల్ గా ఏదైతే మేకర్స్ అనుకున్నారో దాని వరకు ఐతే బెటర్ అవుట్ పుట్ ఇచ్చారని ప్రేక్షకుల స్పందన వస్తుంది.

సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు క్రిటిక్స్ రివ్యూ రేటింగ్ ఎలా ఉన్నా కూడా ఆడియన్స్ కు మాత్రం ఇదొక వన్ టైం వాచబుల్ ఎంటర్టైనింగ్ సినిమాలాగా వారు చెబుతున్నారు. అఫ్కోర్స్ సినిమాలో కొన్ని ట్రాక్ తప్పినా ఇంకాస్త బెటర్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే యునానిమస్ గా హిట్ టాక్ వచ్చే ఛాన్స్ ఉండేది.