Begin typing your search above and press return to search.

సంక్రాంతి సందడి.. ఫస్ట్ మూవీకి కలిసి రావడం లేదా?

సంక్రాంతి అంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పెద్ద పండుగ. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చే ఆ సీజన్‌ ను టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు బరిలో దిగుతుంటాయి.

By:  M Prashanth   |   9 Jan 2026 11:34 AM IST
సంక్రాంతి సందడి.. ఫస్ట్ మూవీకి కలిసి రావడం లేదా?
X

సంక్రాంతి అంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పెద్ద పండుగ. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చే ఆ సీజన్‌ ను టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు బరిలో దిగుతుంటాయి. భారీ అంచనాలు, రికార్డు స్థాయిలో బిజినెస్, గ్రాండ్ ప్రమోషన్లతో విడుదలయ్యే సంక్రాంతి సినిమాలు సాధారణంగా బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తాయని భావిస్తారు. మంచి వసూళ్లు సాధిస్తాయని అంచనా వేస్తారు.

కానీ ఇటీవల సంవత్సరాల్లో సంక్రాంతికి మొదటగా విడుదలైన కొన్ని స్టార్ హీరోల సినిమాలు అనుకున్న రేంజ్ లో రిజల్ట్ అందుకోలేకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఆ లిస్ట్ లో ముందుగా గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి. 2018 సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా.. మొదటి షో నుంచే మిక్స్‌ డ్ టాక్‌ అందుకుంది.

త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్‌ పై ఉన్న అంచనాలు అందుకోలేకపోయింది. కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో వచ్చిన విమర్శలు సినిమాపై ప్రభావం చూపించాయి. అదే తరహాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కూడా 2024 సంక్రాంతి బరిలోకి దిగింది. భారీ బిజినెస్‌ తో, మాస్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన మూవీ నుంచి అభిమానులు ఎక్కువ ఆశించారు.

కానీ రిలీజయ్యాక స్టోరీ, టోన్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చినా, మొత్తంగా సినిమా మిక్స్‌ డ్ టాక్‌ కే పరిమితమైంది. 2025 సంక్రాంతికి రామ్ చరణ్ లీడ్ రోల్‌ లో వచ్చిన గేమ్ ఛేంజర్ పరిస్థితి కూడా అంతే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ విడుదల తర్వాత కథలో కన్ఫ్యూజన్, రన్ టైమ్ పై విమర్శలు వచ్చాయి. హైప్ క్రియేట్ అయినా.. సినిమా ఆశించినంత హిట్ గా నిలవలేకపోయింది. తాజాగా 2026 సంక్రాంతికి ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ విడుదలైంది. డార్లింగ్ నుంచి పూర్తి స్థాయి ఎంటర్టైనర్ కోసం ఎదురుచూసిన అభిమానులకు సినిమా నచ్చింది. కానీ అందరినీ మెప్పించలేకపోయినట్లు తెలుస్తోంది.

హారర్ కామెడీ అంశాలతో రూపొందిన ఆ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా నాలుగు సంవత్సరాల్లో సంక్రాంతికి ముందుగా విడుదలైన పవన్, మహేష్, చరణ్, ప్రభాస్ సినిమాలు మిక్స్‌ డ్ టాక్‌ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే అది యాదృశ్చికమనే చెప్పాలి. ఎందుకంటే ఏ సినిమా రిజల్ట్ కు అయినా కంటెంటే కీలకం. అది బాగుంటేనే రిజల్ట్ అనుకున్న రేంజ్ లో వస్తుంది.