Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్.. ఏ మేరకు ఆదరిస్తారు?

సాధారణంగా సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి , క్రిస్మస్ వంటి పండుగల సమయంలో అటు ప్రభుత్వాలు కూడా హాలిడేస్ ప్రకటిస్తాయి.

By:  Madhu Reddy   |   5 Jan 2026 3:48 PM IST
ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్.. ఏ మేరకు ఆదరిస్తారు?
X

సాధారణంగా సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి , క్రిస్మస్ వంటి పండుగల సమయంలో అటు ప్రభుత్వాలు కూడా హాలిడేస్ ప్రకటిస్తాయి. ఆ హాలిడేస్ ను సద్వినియోగం చేసుకోవడానికి దర్శక నిర్మాతలు మంచి కథ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా భిన్నవిభిన్నమైన జానర్లలో ప్రేక్షకులను మెప్పించి, సక్సెస్ కొట్టే దిశగా అడుగులు వేస్తారు. ఇకపోతే అటు దర్శక నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని ఎంతైతే ప్రయత్నం చేస్తారో.. ఇటు ఆడియన్స్ కూడా మంచి వినోదాత్మక చిత్రాలను చూడాలని ఆసక్తి కనపరుస్తూ ఉంటారు.

అందులో భాగంగానే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, రొమాంటిక్ , యాక్షన్ , థ్రిల్లర్, హారర్ ఇలా పలు జానర్ లలో సినిమాలు చూడాలని ఆసక్తి అందరిలో ఉంటుంది. అలా అన్ని జానర్లలో సినిమాలు వస్తేనే ప్రేక్షకుడికి దేనిపైన ఆసక్తి ఉంటుందో ఆ చిత్రానికి ఎక్కువగా థియేటర్ కి వెళ్తారు.

అయితే ఈసారి అలా కాదు. సంక్రాంతి పండుగను మరింత కలర్ ఫుల్ చేసి జాలీగా గడపడానికి అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలే సిద్ధమయ్యాయి. పైగా వీటిని కుటుంబ సభ్యులతో కలిసి చూడడానికి సెన్సార్ బోర్డు కూడా అన్నింటికీ యూఏ లేదా యూ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలా ది రాజాసాబ్ సినిమాతో మొదలయ్యే సంక్రాంతి హడావిడి అనగనగా ఒక రాజు సినిమాతో ఎండ్ అవుతుంది. మధ్యలో వచ్చే ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ సినిమాల ఫలితాలు ఏంటి? అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే ఈ సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో ఏ మూవీకి ప్రేక్షకుడు బ్రహ్మరథం కడతాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇక సంక్రాంతికి రాబోతున్న చిత్రాల విషయానికి వస్తే.. జనవరి 9వ తేదీన ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ది రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ , హారర్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల యూ/ఏ సర్టిఫికెట్ లభించడంతో పిల్లలు, పెద్దలు అందరూ కూడా థియేటర్లకే క్యూ కడతారు. అలాగే సంక్రాంతి బరిలో నిలిచిన మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ లభించింది.

అటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రొమాన్స్ కారణంగా యు రాకపోయినా యూ/ఏ అయితే పక్కాగా లభిస్తుంది. ఇక అలాగే అనగనగా ఒక రాజు చిత్రం వినోదానికే డామినేషన్ కాబట్టి కచ్చితంగా ఈ చిత్రానికి కూడా యూ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అటు నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా ఫ్యామిలీ క్యాటగిరీ . ఇకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు అంటే ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే దీన్ని బట్టి చూస్తే ఈసారి సంక్రాంతి పండుగ అసలైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా నిలవనుంది. ఇక టికెట్ల రేట్లు పెంపు, ప్రీమియర్ షోలు, థియేటర్ల పంపకాలు త్వరగా ఒక కొలిక్కి వస్తే తమకు నచ్చిన సినిమాకు వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఆడియన్స్. మొత్తానికైతే ఈ సంక్రాంతి థియేటర్ల వద్ద అసలైన సంక్రాంతిగా మారనుంది అని దాదాపు అన్ని చిత్రాలు కూడా మంచి విజయం సాధిస్తాయని సగటు ప్రేక్షకులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.