2027 సంక్రాంతి రిలీజ్ లు ఇప్పటికివేనా?
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన కొన్ని సినిమాలు మంచి ఫలితాలు సాధించాయి. `మనశంకర వరప్రసాద్ గారు` బ్లాక్ బస్టర్ అయింది.
By: Srikanth Kontham | 23 Jan 2026 4:00 PM ISTఈ సంక్రాంతికి రిలీజ్ అయిన కొన్ని సినిమాలు మంచి ఫలితాలు సాధించాయి. `మనశంకర వరప్రసాద్ గారు` బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల వసూళ్లను సాధించింది. స్టిల్ ఇంకా థియేటర్లలలో ఆక్యుపెన్సీ అదే స్థాయిలో ఉంది. తాజా సన్నివేశం చూస్తుంటే? 400 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన `నారీ నారీ నడుమ మురారీ` కూడా మంచి విజయం సాధించింది. శర్వాకి చాలా కాలం తర్వాత పడిన సక్సెస్ ఇది. సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. అలాగే మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా సంక్రాంతి రేసులో నిలబడ్డాడు.
పెద్ద పెద్ద స్టార్లు ఉన్నా? భయపడ కుండా కాన్పిడెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయ్యాడు. అతడు నటిం చిన `అనగనగా ఒక రాజు` మంచి విజయం సాధించింది. అలాగే మాస్ రాజా రవితేజ నటించిన `భర్త మహాయులకు విజ్ఞప్తి` కూడా యావరేజ్ గా ఆడింది. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడం సినిమాకు కలిసొచ్చింది. ఈ సంక్రాంతి డిజాస్టర్ ఏదంటే `ది రాజాసాబ్` మాత్రమే. ప్రభాస్ ఇమేజ్ తో మంచి ఓపెనింగ్స్ సాధించినా? కంటెంట్ వైఫల్యంతో ఫెయిలైంది. అలా ఈ సంక్రాంతి ముగిసింది. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతి రిలీజ్ లపై అప్పుడే చర్చ మొదలైంది.
కొన్ని సినిమాలు కర్చీప్ వేయడంతో వాటిపై చర్చ షరా మామూలైంది. హిట్ మెషిన్ అనీల్ రావిపూడి స్టోరీ లైన్ ఫిక్స్ అయింది. కానీ ఇంకా స్టోరీ సిద్దం కాలేదు. అది రెడీ అయిన తర్వాత హీరో ఫైనల్ అవుతాడు. కానీ ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి పక్కా రిలీజ్ అని తేలిపోయింది. సక్సెస్ సెంటిమెంట్ ని అనీల్ మిస్ చేసుకోడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ అవుతుందని సమాచారం. `వాల్తేరు వీరయ్య` మ్యాజిక్ రిపీట్ చేయాలన్నది ఆ కాంబినేషన్ ప్లాన్.
అలాగే శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించారు. ఇలా మూడు నాలుగు సినిమాలు సంక్రాంతికి అప్పుడే కర్చీప్ వేసేసాయి. ఇంకా ఈ రేసులో చాలా చిత్రాలు చేరే అవకాశం ఉంది. ప్రస్తుం సెట్స్ లో ఉన్న సినిమాలు షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సకాలంలో పూర్తయ్యాయి? అంటే సంసక్రాంతి సీజన్ మిస్ చేసుకోవు. కచ్చితంగా పోటీ బరిలో నిలిచే అవకాశం ఉంటుంది.
