Begin typing your search above and press return to search.

2027 సంక్రాంతి మామూలుగా ఉండ‌దు!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంక్రాంతి బిగ్ సీజ‌న్‌. సంక్రాంతి వ‌చ్చేస్తోందంటే నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున వంటి హీరోలు త‌మ సినిమాల‌ని రంగంలోకి దించేయ‌డానికి రెడీ అవుతుండే వారు.

By:  Ravindar Gorantla   |   28 Feb 2026 1:00 AM IST
2027 సంక్రాంతి మామూలుగా ఉండ‌దు!
X

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంక్రాంతి బిగ్ సీజ‌న్‌. సంక్రాంతి వ‌చ్చేస్తోందంటే నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున వంటి హీరోలు త‌మ సినిమాల‌ని రంగంలోకి దించేయ‌డానికి రెడీ అవుతుండే వారు. అయితే గ‌త కొంత కాలంగా ఈ సీజ‌న్‌పై క‌ర్చీఫ్ వేసేసి క‌బ్జా చేస్తున్నాడు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. త‌ను చేసిన సినిమాలు వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలుస్తుండ‌టంతో ఇప్పుడు అంద‌రి దృష్టి సంక్రాంతి సీజ‌న్‌పై ప‌డింది. దీంతో వ‌చ్చే సంక్రాంతికి చిన్నా పెద్దా అని తేడా లేకుండా సీనియ‌ర్ టు టైర్ 2 హీరోలు బ‌రిలోకి దిగుతున్నారు. దీంతో 2027 సంక్రాంతి ఫైట్ మామూలుగా ఉండ‌ద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్‌, కింగ్ నాగార్జున‌, క‌ల్యాణ్‌రామ్‌, నితిన్‌, శ‌ర్వానంద్‌, వ‌రుణ్ తేజ్‌వంటి త‌దిత‌ర హీరోలు వ‌చ్చే సంక్రాంతికి క్రేజీ సినిమాల‌తో బ‌రిలోకి దిగ‌బోతున్నారు. సంక్రాంతిని ప్ర‌ధానంగా టార్గెట్‌గా పెట్టుకుని వీరు సినిమాలు రెడీ చేసుకుంటున్నారు. బాబి కొల్లితో చిరు ఓ మాస్ మ‌సాలా యాక్ష‌న్ డ్రామాని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇది సంక్రాంతికి రాబోతోంది. ఇక నంద‌మూరి బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని ఓ పీరియాడిక్ యాక్ష‌న్ డ్రాయాని చేస్తున్నారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ కూడా సంక్రాంతికి రావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

కింగ్ నాగార్జున సినిమా కూడా ఇదే బాట‌లో ప‌య‌నించ‌బోతోంది. విక్ట‌రీ వెంక‌టేష్‌, క‌ల్యాణ్‌రామ్‌ల కాంబినేష‌న్‌లో అనిల్ రావిపూడి చేయ‌బోతున్న సినిమా కూడా సంక్రాంతి టార్గెట్‌గా పెట్టుకుంది. నితిన్‌- ఆయ్ డైరెక్ట‌ర్ సినిమా, శ‌ర్వానంద్‌, శ్రీ‌ను వైట్ల మూవీ, వ‌రుణ్‌తేజ్‌తో మారుతి హార‌ర్ కామెడీ త‌దిత‌ర ప్రాజెక్ట్‌ల‌తో పాటు మ‌రి కొన్ని కూడా ఇదే పొంగ‌ల్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నాయని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సంక్రాంతికి వ‌చ్చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్న సినిమాల‌కు అనిల్ రావిపూడి ఫార్ములాని అప్లై చేస్తూ సంక్రాంతి టైటిల్స్ పెట్టేస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నితిన్‌, ఆయ్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ సినిమాకు `సంక్రాంతి శుభాకాంక్ష‌లు` అని పేరు పెట్టేస్తున్నారు. మారుతి అయితే ఏకంగా `హ్యాపీ పొంగ‌ల్‌` ని వ‌రుణ్ తేజ్ కోసం లాక్ చేసుకున్నాడు. ఇదంతా గ‌మ‌నించిన యంగ్ ప్రొడ్యూస‌ర్ రాజేష్ దండ త‌న కొత్త సినిమా కోసం `అదిరిపోద్ది సంక్రాంతి`ని రిజిస్ట‌ర్ చేయించేశాడు. మ‌రొక రైట‌రేమో `పండ‌గ బొమ్మ‌` అంటూ షాక్ ఇస్తున్నాడు.ఇలా వ‌చ్చే సంక్రాంతికి చిన్నా పెద్దా అంతా టైటిల్స్‌తో మ‌రి దండ‌యాత్ర‌కు రెడీ అయిపోతుండ‌టంతో 2027 సంక్రాంతి స‌మ‌రం మామూలుగా ఉండేలా క‌నిపించ‌డం లేదు.

అనిల్ రావిపూడి సంక్రాంతి టైటిల్స్‌తో సంక్రాంతి బ‌రిలో స‌క్సెస్ అయ్యాడు క‌దా అని అంతా అదే ఫార్ములాని వాడేస్తాం అంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని, కంటెంట్‌ని న‌మ్ముకుని సినిమాలు చేస్తే స‌క్సెస్ అదే వ‌స్తుంద‌ని.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి ఫార్ములాని న‌మ్ముకుని స‌రైన కంటెంట్ లేకుండా స‌క్సెస్ టార్గెట్‌గా సినిమాల‌ని సంక్రాంతి బ‌రిలోకి వ‌దిలితే పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. చాలా వ‌ర‌కు మిస్ పైర్ అయి చేతులు కాల్చుకోవ‌డం ఖాయం.