Begin typing your search above and press return to search.

సంక్రాంతి ముందు పండుగ.. అప్పుడే హీరోల క్యూ..

దీంతో 2027 సంక్రాంతి వద్ద భారీ పోటీ ఉండనున్నట్లు అర్థమవుతోంది. అలా కొన్ని రోజులుగా పొంగల్ ఫైట్ కోసం చర్చ సాగుతోంది.

By:  M Prashanth   |   19 Feb 2026 8:00 AM IST
సంక్రాంతి ముందు పండుగ.. అప్పుడే హీరోల క్యూ..
X

2026 సినీ సంక్రాంతి కంప్లీట్ అయ్యి నెల రోజులు కూడా అవ్వలేదు. కానీ అప్పుడే వచ్చే ఏడాది పొంగల్ సీజన్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ఐదు సినిమాలు రిలీజ్ కాగా.. నెక్స్ట్ ఇయర్ అంతకుమించి పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని సమాచారం.

బాబీతో చేస్తున్న మూవీతో చిరు వస్తున్నట్లు తెలుస్తుండగా, బాలయ్య- హరీష్ శంకర్ కాంబోలో రూపొందనున్న సినిమా సంక్రాంతి పండక్కి రిలీజ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న చిత్రంతో వెంకటేష్, కళ్యాణ్ కురసాల తీయనున్న సినిమాతో నాగార్జున పొంగల్ కు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారితోపాటు యంగ్ హీరో శర్వానంద్ రానున్నట్లు తెలుస్తోంది. ఆయనే ఆ విషయాన్ని రీసెంట్ గా వెల్లడించారు.

దీంతో 2027 సంక్రాంతి వద్ద భారీ పోటీ ఉండనున్నట్లు అర్థమవుతోంది. అలా కొన్ని రోజులుగా పొంగల్ ఫైట్ కోసం చర్చ సాగుతోంది. అయితే సంక్రాంతి కన్నా ముందు వచ్చే బెస్ట్ మూవీ సీజన్ దసరా. ఆ టైమ్ లో కూడా ప్రతి ఏడాది అనేక సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అదే సమయంలో ఈసారి సమ్మర్ లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, చరణ్ పెద్ది తప్ప మిగతా బడా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో అందరి ఫోకస్ దసరాపై పడింది.

స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ తమ సినిమాలను పండుగ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండటంతో దసరా పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న NBK 111 మూవీ దసరా బరిలో నిలవనుంది. వారిద్దరూ ఇప్పటికే కలిసి చేసిన వీర సింహారెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో.. కొత్త సినిమాపై అంచనాలు అందరిలో పెరిగాయి.

అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ కూడా దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. బాలయ్య, ప్రభాస్ తో పాటు యంగ్ హీరో రోషన్ మేక కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ ఏమో ఏమో ఇది మూవీతో దసరా రేసులో దిగుతున్నారు.

హిట్ ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా.. ఇప్పటికే టీజర్ యూత్‌ ను ఆకట్టుకోవడంతో సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. తమిళ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న శేయోన్ తెలుగులోనూ దసరా సీజన్‌ ను టార్గెట్ చేస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఆ మూవీ.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సాగే పవర్‌ ఫుల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గట్టి పోటీ ఉన్నా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న సినిమాలే దసరా విన్నర్స్ గా నిలుస్తాయి. ఏదేమైనా హీరోలు అప్పుడే సంక్రాంతితోపాటు దసరాకు కూడా క్యూ కట్టేశారని చెప్పాలి.