Begin typing your search above and press return to search.

సంక్రాంతి టాలీవుడ్.. ఐదు సినిమాల పరిస్థితేంటి?

2026 సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద పోటీ మామూలుగా లేదు. ఒకేసారి ఐదు భారీ సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

By:  M Prashanth   |   15 Jan 2026 12:43 PM IST
సంక్రాంతి టాలీవుడ్.. ఐదు సినిమాల పరిస్థితేంటి?
X

2026 సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద పోటీ మామూలుగా లేదు. ఒకేసారి ఐదు భారీ సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు యూత్ హీరోల చిత్రాలు కూడా బరిలో ఉండటంతో ప్రేక్షకులకు పండుగ విందు దక్కినా, నిర్మాతలు- డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం టెన్షన్ తప్పలేదు. విడుదలైన సినిమాల టాక్‌, రివ్యూలతో సంక్రాంతి రేసు ఆసక్తికరంగా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీపై రిలీజ్ కు భారీ అంచనాలు ఉండగా, సినిమా విడుదలైన తర్వాత మిక్స్‌ డ్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రభాస్ స్టామినా, కొన్ని సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, స్టోరీ విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా ఫైనల్ రన్ ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను బాగా ఆకట్టుకుంది. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కలిసి సినిమాను హిట్ ట్రాక్‌ లో నడిపిస్తున్నాయి. అదే సమయంలో మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం యావరేజ్ రివ్యూలతో థియేటర్లలో కొనసాగుతోంది.

కొన్ని చోట్ల సినిమా బాగుందని టాక్ వస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో నార్మల్ రెస్పాన్స్ మాత్రమే వస్తోంది. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ పరంగా యావరేజ్ స్థాయిలోనే నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. యూత్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు మాత్రం సర్‌ ప్రైజ్ ప్యాకేజ్‌ లా మారింది . కథ, స్క్రీన్‌ ప్లే, నవీన్ పెర్ఫార్మెన్స్‌ కు మంచి రివ్యూలు రావడంతో పాటు రేటింగ్స్ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి.

ఆ సినిమా సక్సెస్ ట్రాక్‌ లో దూసుకెళ్తూ సంక్రాంతి రేసులో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి కూడా మంచి స్పందనతో ముందుకు సాగుతోంది. వినోదంతో పాటు భావోద్వేగాలతో కూడిన స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంచి రివ్యూలు, రేటింగ్స్ రావడంతో ఆ సినిమా కూడా విజయం దిశగా సాగుతోంది. మొత్తానికి ఐదు సినిమాల్లో మూడు చిత్రాలు స్పష్టంగా సక్సెస్ ట్రాక్‌ ను అందుకున్నాయి.

మరో రెండు సినిమాలు యావరేజ్ టాక్ తో కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్ షేరింగ్ పెద్ద సమస్యగా మారింది. ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయన్నది క్లారిటీ రావడం కష్టమే. కానీ అన్ని సినిమాల ఫైనల్ తీర్పు మాత్రం సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాతే తేలనుంది. అప్పటివరకు బాక్సాఫీస్ పోరు మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. మరి ఏ మూవీ.. ఎలాంటి రిజల్ట్ ను సాధిస్తుందో వేచి చూడాలి.