Begin typing your search above and press return to search.

సంక్రాంతి వార్.. తెరవెనుక అసలు డీల్ ఇదేనా?

చిరంజీవి, ప్రభాస్, విజయ్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి.. ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురు హీరోలు తమ సినిమాలతో పండగ బరిలో దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి.

By:  M Prashanth   |   22 Oct 2025 8:00 AM IST
సంక్రాంతి వార్.. తెరవెనుక అసలు డీల్ ఇదేనా?
X

​సంక్రాంతి పండగంటే టాలీవుడ్‌కు పెద్ద జాతర. బాక్సాఫీస్ దగ్గర అసలైన కలెక్షన్ల పండగ మొదలయ్యేది అప్పుడే. అందుకే, ప్రతీ ఏడాది పెద్ద హీరోల నుంచి చిన్న సినిమాల వరకు, అందరూ ఈ సీజన్‌పై కన్నేస్తారు. అయితే, వచ్చే ఏడాది (2026) సంక్రాంతి మాత్రం మామూలుగా ఉండబోదనిపిస్తోంది. ఏకంగా ఆరు సినిమాలు బరిలో నిలుస్తుండటంతో, థియేటర్ల యుద్ధం మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

​చిరంజీవి, ప్రభాస్, విజయ్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి.. ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురు హీరోలు తమ సినిమాలతో పండగ బరిలో దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఒకరకంగా పండగే అయినా, థియేటర్ల పంపకాల విషయంలో మాత్రం పెద్ద తలనొప్పి ఖాయం. ఇన్ని సినిమాలకు సరిపడా స్క్రీన్లు సర్దడం, కలెక్షన్లు డివైడ్ అవ్వకుండా చూసుకోవడం డిస్ట్రిబ్యూటర్లకు కత్తి మీద సాము లాంటిది.

​ఈ స్క్రీన్ల యుద్ధం నేపథ్యంలో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ రేసులో ఉన్న ఇద్దరు అతిపెద్ద ప్లేయర్స్ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. అదే, మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రాల మధ్య స్క్రీన్ల పంపకాల ఒప్పందం. ఈ రెండు భారీ చిత్రాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకుని, స్క్రీన్లను సామరస్యంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

​ఒకవేళ ఇదే నిజమైతే, ఇది ఇద్దరు హీరోలకు, వారి సినిమాలకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఒకరిపై ఒకరు పోటీ పడి, అనవసరంగా థియేటర్ల కోసం అనవసర చర్చలకు పోకుండా , ఇలా మ్యూచువల్‌గా స్క్రీన్లను పంచుకోవడం వల్ల, రెండు సినిమాలకూ మంచి రీచ్ దొరుకుతుంది. కలెక్షన్లు కూడా అనవసరంగా స్ప్లిట్ అవ్వకుండా, తమ మార్కెట్‌కు తగ్గట్టుగా వసూళ్లు రాబట్టుకోవడానికి వీలుంటుంది.

​ఈ రెండు పెద్ద సినిమాలు ఇలా సర్దుకుపోతే, మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి అనేది మరో ప్రశ్న. చిరంజీవి, ప్రభాస్ సినిమాల తర్వాతే మిగిలిన స్క్రీన్లు మిగతా చిత్రాలకు దక్కుతాయి. అయితే, పండగ సీజన్ కాబట్టి, కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలకు కూడా మంచి రన్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ, ఈ ఇద్దరు పెద్ద హీరోల మధ్య డీల్ మాత్రం, మిగిలిన వారిపై ఒత్తిడి పెంచడం ఖాయం. ​మొత్తం మీద, ఈ సంక్రాంతి వార్‌లో తెరవెనుక కొన్ని ఆసక్తికరమైన వ్యూహాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. స్క్రీన్ల పంపకాలపై వినిపిస్తున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.