సంక్రాంతి 2026 వార్.. సిక్స్ కొట్టేది ఎవరు?
ప్రతి సంక్రాంతికి టాలీవుడ్‌లో క్రేజీ సినిమాలు పోటీపడటం సర్వసాధారణం. అయితే ఒక్కేసారి ఈ ఫెస్టివల్‌కు రెండు నుంచి మూడు సినిమాలు మాత్రమే బరిలో నిలిచేవి.
By: Tupaki Entertainment Desk | 20 Dec 2025 1:17 PM ISTప్రతి సంక్రాంతికి టాలీవుడ్‌లో క్రేజీ సినిమాలు పోటీపడటం సర్వసాధారణం. అయితే ఒక్కేసారి ఈ ఫెస్టివల్‌కు రెండు నుంచి మూడు సినిమాలు మాత్రమే బరిలో నిలిచేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి `మన శంకర వరస్రసాద్ గారు`తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `ది రాజాసాబ్` కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడితో కలిసి తన మార్కు ఫ్యామిలీ అంశాలతో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా చేసిన మూవీ `మన శంకరవరప్రసాద్ గారు`.
2025 సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సందడి చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలోకి చిరుతో దిగుతున్నాడు. దీంతో ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్‌లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక దీనికి రెండు రోజుల ముందు సంక్రాంతి సందడిని మొదలు పెడుతూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ `ది రాజా సాడ్` రాబోతోంది.
ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేస్తున్న కామెడీ హారర్ మూవీ ఇది. పీపుల్ మీడియా బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ అ్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మారుతికిది తొలి పాన్ ఇండియా స్టార్ మూవీ కావడంతో ఈందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఇక వీటితో పాటు మాస్ మహారాజా తొలి సారి తన పంథాకు పూర్తి భిన్నంగా చేస్తున్న ఫ్యామిలీ డ్రామా మూవీ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాడబోతోంది. కిషోర్ తిరుమల కొంత విరామం తరువాత చేస్తున్న సినిమా ఇది. అషికా రంగనాథ్, డిపుల్ హయాతీ హీరోయిన్‌లు నటించిన ఈ మూవీపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి.
వీరితో సంక్రాంతి బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు యంగ్ హీరోలు నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ కూడా దిగుతున్నారు. నవీన్ పొలిశెట్టి దాదాపు రెండేళ్ల విరామం తరువాత చేసిన మూవీ `అనగనగా ఒక రాజు` మీనాక్షీ చౌదరి హీరోయిన్. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుండగా, శర్వానంద్ నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా `నారీ నారీ నడుమ మురారీ` కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ తెలుగు సినిమాలతో పాటు దళపతి విజయ్ తమిళ డబ్బింగ్ మూవీ `జననాయకుడు` జనవరి 9నే బరిలోకి దిగుతోంది.
సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు దిగుతున్నా ఈ రేసులో పైచేయి సాధించేది ఎవరనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కామెడీ హారర్ థ్రిల్లర్ `ది రాజా సాబ్`తో బరిలోకి దిగుతున్నా తన క్రేజ్‌కు తగ్గ స్థాయిలో మాత్రం సందడి చేయలేకపోతోంది. కానీ మెగాస్టార్ `మన శంకర వరప్రసాద్ గారు` మాత్రం ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అటెన్షన్‌ని గ్రాబ్ చేసి సంక్రాంతి సినిమాల రేస్‌లో ముందంజలో నిలచింది. మొదటి నుంచి ఓ కాన్సెప్ట్ ప్రకారం సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్న అనిల్ రావిపూడి ఈ మూవీని తనదైన మార్కు పబ్లిసిటీలో సంక్రాంతి రేసులో ముందంజలో ఉండేలా చేయడం గమనార్హం. ఈ లెక్కన చూస్తే స్పీడు తగ్గిన `ది రాజా సాబ్`ని వెనక్కి నెట్టి సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద సిక్స్ కొట్టేది చిరంజీవే అని స్పష్టమవుతోంది.
