ఈ వారం రిలీజులివే.. మూవీ లవర్స్ కు పండగే!
మరో వారం వచ్చేసింది. ఎప్పటికంటే మరింత సందడిగా ఈ వారం ఉండబోతుంది. దానికి కారణం సంక్రాంతి పండుగ సీజన్ కావడమే.
By: Sravani Lakshmi Srungarapu | 11 Jan 2026 4:34 PM ISTమరో వారం వచ్చేసింది. ఎప్పటికంటే మరింత సందడిగా ఈ వారం ఉండబోతుంది. దానికి కారణం సంక్రాంతి పండుగ సీజన్ కావడమే. ఈ ఏడాది సంక్రాంతికి పలు ఎంటర్టైనింగ్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా, మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వాటిలో చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12న, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు జనవరి 14న, నారీ నారీ నడుమ మురారి జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో ఏ సినిమాకు ఆ సినిమానే స్పెషల్ క్రేజ్ ను కలిగి ఉండటంతో ఈ వారం సినీ లవర్స్ కు సంక్రాంతి కంటే పెద్ద పండగ కాబోతుంది. ఇవి కాకుండా కొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రాబోతున్నాయి. అవేంటో చూద్దాం. ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
అగాథా క్రిస్టీ సెనెన్ డయల్స్ అనే వెబ్‌సిరీస్
తస్కరీ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్
ది రిప్ అనే సినిమా
ప్రైమ్ వీడియోలో..
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ అనే కన్నడ సినిమా
నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ సీజన్2
120 బహదూర్ అనే బాలీవుడ్ సినిమా
జియో హాట్‌స్టార్ లో..
ఇండస్ట్రీ అనే వెబ్‌సిరీస్ సీజన్4
సోనీ లివ్‌లో..
కాలమ్‌కావల్ అనే మలయాళ సినిమా
జీ5లో..
గుర్రం పాపిరెడ్డి అనే తెలుగు సినిమా
భా.. భా.. భా అనే మలయాళ మూవీ
