సంక్రాంతి సినిమాలు.. ఏది ఎప్పుడు రిలీజ్ అవ్వనుంది?
సంక్రాంతి.. తెలుగు ప్రజలకు ఎంత ముఖ్యమైన పండుగో.. టాలీవుడ్ కు కూడా అంతే మెయిన్ పండుగ.
By: M Prashanth | 6 Dec 2025 3:38 PM ISTసంక్రాంతి.. తెలుగు ప్రజలకు ఎంత ముఖ్యమైన పండుగో.. టాలీవుడ్ కు కూడా అంతే మెయిన్ పండుగ. ఎందుకంటే పొంగల్ టైమ్ లో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు సినీ ప్రియులు. అప్పుడే చిత్రాలను రిలీజ్ చేస్తే మంచి వసూళ్లను రాబట్టుకోవచ్చని మేకర్స్ యోచిస్తుంటారు.
దీంతో ముందు నుంచే తమ సినిమాలు.. సంక్రాంతికి విడుదల అంటూ ప్రకటిస్తుంటారు.. కర్చీఫులు వేస్తుంటారు. అయితే ఏటా సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా గట్టి పోటీ ఉంటుంది. అది కామన్ అయిపోయింది. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఏకంగా ఏడు సినిమాలు.. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కానున్నాయి.
టాలీవుడ్ హీరోలు చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి వేర్వేరుగా లీడ్ రోల్స్ లో నటించిన చిత్రాలు పొంగల్ స్పెషల్ గా విడుదల కానున్నాయి. అదే సమయంలో కోలీవుడ్ హీరోలు విజయ్ దళపతి, శివ కార్తికేయన్ వేర్వేరుగా నటించిన సినిమాలు కూడా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూపంలో సందడి చేయనున్నాయి.
అయితే ఇప్పుడు దాదాపు ఏడు సినిమాలు రిలీజ్ డేట్స్ కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ముందుగా సంక్రాంతి సందడి ప్రభాస్ ది రాజా సాబ్ మూవీతో మొదలవనుంది. ఆ సినిమా జనవరి 9వ తేదీన విడుదల కానుంది. అదే రోజు విజయ్ దళపతి కెరీర్ లో చివరి మూవీగా రూపొందుతున్న జన నాయగన్ కూడా థియేటర్లలోకి రానుంది.
ఆ తర్వాత జనవరి 12వ తేదీన చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. ది రాజా సాబ్, జన నాయగన్ వచ్చిన మూడు రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. సంక్రాంతికి ఏడు సినిమాలు రిలీజ్ అవుతుండగా.. కేవలం చిరు చిత్రం మాత్రం సోలోగా విడుదల అవ్వనుంది.
మన శంకర వరప్రసాద్ గారు తర్వాత రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి.. జనవరి 13వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం. ఆ తర్వాత రోజు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీతోపాటు శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలు రానున్నాయట. చివరగా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదలవుతుందని టాక్. అయితే మరోసారి లిస్ట్ రూపంలో తెలుసుకుందాం.
ది రాజా సాబ్- జనవరి 9
జన నాయగన్- జనవరి 9
మన శంకర వర ప్రసాద్ గారు- జనవరి 12
భర్త మహాశయులకు విజ్ఞప్తి- జనవరి 13
అనగనగా ఒక రాజు- జనవరి 14
పరాశక్తి- జనవరి 14
నారీ నారీ నడుమ మురారి- జనవరి 15
