విజయ్ కోసం శివకార్తికేయన్ అంత వరకు వెళ్లాడా?
ఈ వార్తలపై హీరో శివ కార్తికేయన్ తాజాగా స్పందించాడు. `పరాశక్తి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.
By: Tupaki Entertainment Desk | 4 Jan 2026 5:15 PM ISTప్రతి హీరో, నిర్మాత, డైరెక్టర్ తమ సినిమాని పొంగల్ రేసులో నిలపాలని, భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. సంక్రాంతి సెంటిమెంట్‌ని, ఆ టైమ్‌లో వచ్చే హాలీడేస్‌ని పక్కగా వాడుకుని బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. కారణం ఈ సీజన్‌లో వరుస సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. దీంతో సినిమాల మధ్య భారీ పోటీ ఏర్పడుతూ ఉంటుంది. కొంత మంది భారీ సినిమాల మధ్య దిగి నలిగిపోవడం ఎందుకని తప్పుకుంటుంటారు.
కొంత మంది కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో బరిలోకి దిగుతుంటారు. ఈ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీపడుతున్నాయి. తెలుగు సినిమాలు `ది రాజాసాబ్`తో పాటు మన శంకర వరప్రసాద్ గారు, భక్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారీ, అనగనగా ఒక రాజు`తో పాటు దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా `జన నాయకుడు` కూడా బరిలోకి దిగుతోంది. వీటితో పాటు శివకార్తికేయన్, సుధా కొంగర కాంబినేషన్‌లో వస్తున్న `పరాశక్తి` రాబోతోంది.
ముందు దీన్ని జనవరి 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తమిళ, తెలుగు భాషల్లో విజయ్ సినిమా `జన నాయకుడు` రిలీజ్ అవుతున్న నేపథ్యంలో `పరాశక్తి`కి థియేటర్లు లభించడం ఇబ్బందిగా మారే అవకాశం ఉండటంతో మేకర్స్ రిలీజ్‌ని కాస్త ముందుకు జరిపి జనవరి 10నే విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్‌ని పరాశక్తి మేకర్స్ మార్చుకోవడానికి ప్రధాన కారణం విజయ్ అని. తన వల్లే శివ కార్తీకేయన్ తన మూవీ రిలీజ్ డేట్‌ని మార్చేశాడట.
ఈ వార్తలపై హీరో శివ కార్తికేయన్ తాజాగా స్పందించాడు. `పరాశక్తి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను ముందు గత ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నామని, అదే సమయంలో విజయ్ `జన నాయగన్` రిలీజ్ అవుతుందని తెలియడంతో ఎందుకు క్లాష్ అని రిలీజ్ వాయిదా వేశామన్నారు. అయితే అనూహ్యంగా రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలవుతుండటం చూసి నేను నిజంగానే షాక్ అయ్యానన్నాడు. అయితే `జన నాయగన్`తో క్లాష్ కాకుండా ఉండటం కోసం మరేదైనా ఆప్షన్ ఉందా అని ప్రయత్నించాను.
అయితే ఫైన్షియర్స్ అందుకు అంగీకరించలేదని, అంతే కాకుండా తమిళ నాట అసెంబ్లీ ఎన్నిలు జరగనున్న కారణంగా రిలీజ్ వాయిదా వేయడం కష్టమని తెలియడంతో సంక్రాంతికే ఫిక్స్ అయ్యామన్నాడు. అంతే కాకుండా `జన నాయగన్`తో ఎలాంటి క్లాష్ ఉండకూడదని ఏకంగా విజయ్ మేనేజర్ జగదీష్‌కే ఫోన్ చేశాడట. `రెండు సినిమాల క్లాష్‌తో మీకు సమస్య ఉండకపోవచ్చు కానీ నాకు మాత్రం సమస్యే ఉంటుంది. `జన నాయగన్`ని విజయ్ సార్ చివరి సినిమాగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఒక్కసారి ఆయన్ని అగడండి` రిలీజ్ డేట్ మార్చుకోండి అని శివ కార్తికేయన్ అడిగాడట.
