ఈ వారం కొత్త రిలీజులివే!
కొత్త సంవత్సరంలో మరో కొత్త వారం వచ్చేసింది. ఈ వీకెండ్ నుంచే సంక్రాంతి సినిమాల హడావిడి మొదలుకానుండగా, వాటిలో ముందుగా రాజా సాబ్ రిలీజ్ కానుంది.
By: Sravani Lakshmi Srungarapu | 5 Jan 2026 6:00 PM ISTకొత్త సంవత్సరంలో మరో కొత్త వారం వచ్చేసింది. ఈ వీకెండ్ నుంచే సంక్రాంతి సినిమాల హడావిడి మొదలుకానుండగా, వాటిలో ముందుగా రాజా సాబ్ రిలీజ్ కానుంది. రాజా సాబ్ తో పాటూ జన నాయకుడు రానుంది. ఆ తర్వాత రోజు శివ కార్తికేయన్ పరాశక్తి బాక్సాఫీస్ వద్ద రిలీజవనుంది. వీటితో ఈ వారం ఓటీటీల్లో కూడా కొన్ని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏమేం రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం. వాటిలో ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
అఖండ2 తాండవం అనే తెలుగు సినిమా
గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ అనే హాలీవుడ్ మూవీ
డిఫైనింగ్ డెస్టినీ అనే కొలంబియన్ వెబ్‌సిరీస్
హిజ్ అండ్ హర్స్ అనే ఇంగ్లీష్ సిరీస్
ది రూకీ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్
దే దే ప్యార్ దే2 అనే బాలీవుడ్ మూవీ
పీపుల్ వియ్ మెట్ ఆన్ వెకేషన్ అనే హాలీవుడ్ మూవీ
ఆల్ఫా మేల్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్4
కాట్ స్టీలింగ్ అనే హాలీవుడ్ మూవీ
జియో హాట్‌స్టార్ లో..
ఎ థౌజండ్ బ్లోస్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2
వెపన్స్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ
జీ5లో..
మాస్క్ అనే తమిళ మూవీ
హనీమూన్ సే హత్య అనే డాక్యుమెంటరీ సిరీస్
జోతో కండో కోల్‌కత్తాయి అనే బెంగాలీ మూవీ-
సన్‌నెక్ట్స్‌లో..
సైలెంట్ క్రైమ్స్ అనే తెలుగు డాక్యుమెంటరీ
సోనీలివ్‌లో..
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2
