Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాలు.. నార్త్ అమెరికాలో 13.5 మిలియన్ల సవాలు

ఈ సంక్రాంతి సీజన్ లో నార్త్ అమెరికాలో మన సినిమాల టార్గెట్లు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. నాలుగు ప్రధాన చిత్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్లను కలిపితే ఏకంగా 13.5 మిలియన్ డాలర్లు.

By:  M Prashanth   |   8 Jan 2026 1:10 PM IST
సంక్రాంతి సినిమాలు.. నార్త్ అమెరికాలో 13.5 మిలియన్ల సవాలు
X

ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు సినిమాల బిజినెస్ రేంజ్ మారిపోయింది. ఈ సంక్రాంతి సీజన్ లో నార్త్ అమెరికాలో మన సినిమాల టార్గెట్లు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. నాలుగు ప్రధాన చిత్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్లను కలిపితే ఏకంగా 13.5 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు 110 కోట్లకు పైనే వసూలు చేయాలి. ఇంత భారీ మొత్తం రాబట్టడం అంటే అమెరికా మార్కెట్ ఎంత కాస్ట్లీగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

అందరికంటే పెద్ద భారం ప్రభాస్ 'ది రాజా సాబ్' పైనే ఉంది. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 7.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవాలి. ప్రభాస్ కి అక్కడ సాలిడ్ మార్కెట్ ఉన్నా.. ఇది చాలా పెద్ద నంబర్. అయితే 'రీఫండబుల్ అడ్వాన్స్' పద్ధతిలో డీల్ జరగడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు కాస్త సేఫ్టీ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం గట్టి యుద్ధమే చేయాల్సి ఉంటుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి తన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో 3.5 మిలియన్ డాలర్ల వేటలో ఉన్నారు. సంక్రాంతికి మెగాస్టార్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది కానీ.. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మాత్రం టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలి. అనిల్ రావిపూడి కామెడీ అమెరికా ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే 'అనగనగా ఒక రాజు' సినిమాకు 1.8 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ ఫిక్స్ చేశారు. తన గత సినిమాల రేంజ్ చూస్తే ఇది సాధ్యమే అనిపించినా.. పండగ పోటీలో ఇన్నేసి సినిమాల మధ్య ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కంటెంట్ లో దమ్ముంటే తప్ప ఈ మార్క్ దాటడం కష్టమే.

ఇక రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా డీసెంట్ టార్గెట్ తోనే రానుంది. టాక్ బాగుంటే ఈ సినిమా కూడా మ్యాజిక్ చేయగలదు. లిస్ట్ లో ఆఖరిగా శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉంది. దీని టార్గెట్ 7 లక్షల డాలర్లుగా ఉంది. మిగతా వారితో పోలిస్తే శర్వాపై ఒత్తిడి తక్కువే కానీ.. అమెరికా ఆడియన్స్ ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చూస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ఈ చిన్న నంబర్ అందుకోవడం కూడా టఫ్ అయిపోతుంది. అందుకే ప్రతి సినిమాకు ఇక్కడ 'క్లీన్ హిట్' టాక్ రావడం చాలా ముఖ్యం.

ఏదేమైనా నార్త్ అమెరికా మార్కెట్ ఇప్పుడు డిఫరెంట్ జోన్ లో ఉంది. టికెట్ రేట్లు పెరగడం వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్ కు రావాలంటే సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి. ఈ 13.5 మిలియన్ల ఛాలెంజ్ లో ఏ హీరో నెట్టుకొస్తాడో, ఏ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవుతాడో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. అందరికీ ఈ పోటీ మాత్రం చాలా టఫ్ గానే ఉండబోతోంది.