నవీన్ పొలిశెట్టి డ్రీమ్ ఎప్పటికి తీరేనో?
కొంత మంది డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని, మరి కొంత మంది యాక్టర్ కావాలని తాను అస్సలు ఊహించలేదని, యాక్సిడెంటల్‌గా యాక్టర్ అయ్యానని మరి కొంత మంది చెబుతుంటారు.
By: Tupaki Entertainment Desk | 12 Jan 2026 1:00 AM ISTకొంత మంది డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని, మరి కొంత మంది యాక్టర్ కావాలని తాను అస్సలు ఊహించలేదని, యాక్సిడెంటల్‌గా యాక్టర్ అయ్యానని మరి కొంత మంది చెబుతుంటారు. కానీ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మాత్రం చిన్నతనం నుంచే తను యాక్టర్ అవ్వాలనుకున్నాడట. ఇందు కోసం తన తండ్రితో నిత్యం గొడవలు పడ్డాడట. ఒక దశలో అవకాశాల కోసం అన్వేషిస్తున్న సమయంలో తన తండ్రితో ఆ గొడవలు ఎక్కువయ్యాయని.. అయితే తల్లి ప్రోత్సాహంతో ఫైనల్‌గా నటుడినయ్యానని చెబుతున్నాడు.
నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న భారీ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ `అనగనగ ఇక రాజు`. మారి దర్శకుడు. సితార నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జనవరి 14న సంక్రాంతి బరిలోకి దిగుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్. కంప్లీట్ నవీన్ మార్క్ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీతో మళ్లీ సక్సెస్‌ని సొంతం చేసుకుంటానని పక్కా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేసింది.
కింగ్ నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు మరింత ప్లస్ అవుతోంది. ఈ నేపథ్యంలో నవీన్ పొలిశెట్టి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి వన్ నేనొక్కడినే వరకు ఎలాంటి క్రెడిట్ లేని క్యారెక్టర్లలో నటించి సరైన టైమ్ కోసం వేచి చూసిన హీరో నవీన్ పొలిశెట్టి. ఏడేళ్ల ప్రయాణం తరువాత `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో హీరోగా ఎంట్రీ ఇవ్వడం.. మంచి సక్సెస్‌ని సొంతం చేసుకోవడం తెలిసిందే. ఆ తరువాత చేసిన `జాతి రత్నాలు` నవీన్‌ని స్టార్‌ని చేసింది. ముంబాయిలో పాకెట్ మనీ కోసం పెళ్లిళ్లలో సహాయకుడిగా పని చేశాడట.
అంతే కాదండోయ్ ఈ స్టేజ్ కి రావడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడట. హీరోగా అవకాశం రావడానికి ముందు ఏ ఆడిషన్‌కి వెళ్లినా టాలెంట్ ఉంది కానీ కాస్త రంగు ఉంటే బావుండేదని, మరో చోట సిక్స్ ప్యాక్ లేదని పొమ్మన్నారట. ఆ తరువాత మరో ఆడిషన్‌లో హైటు లేవని పక్కన పెట్టారట. దీంతో రోడ్డుపై నడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడట. సినిమా ఒక్కటే తన ప్రపంచం కావడంతో ఎందరో ఆత్మీయులకు దూరమయ్యాడట. అయితే హీరోగా ఇప్పుడిప్పుడే నిలబడుతున్న నవీన్‌కు తీరని కోరికలు ఉన్నాయట. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి, రాజు హిరానీ, జోయా అక్తర్ వంటి దర్శకులతో కలిసి పని చేయాలని ఉందట. ఆ డ్రీమ్ ఎప్పటికి తీరుతుందో తెలియదని చెబుతున్నాడు.
ఈ ముగ్గురు డైరెక్టర్లతో నవీన్ పొలిశెట్టి కలిసి పని చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. రెండు మూడు బ్లాక్ బస్టర్లు కొట్టాలి. అలా అయినా రాజమౌళి, రాజు హిరానీ, జోయా అక్తర్‌లతో నవీన్ సినిమా కార్యరూపం దాల్చుతుందనే గ్యారెంటీ లేదు. దీంతో నవీన్ డ్రీమ్ డ్రీమ్ గానే ఉండిపోయే అవకాశం ఉందని కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
