సంక్రాంతికి 'రాజు' గారు రావడం లేదా?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ కీలకమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 24 Nov 2025 12:13 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ కీలకమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఏటా పొంగల్ కు అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. బెర్తులను ఖరారు చేసుకోవడానికి ముందు నుంచే కర్చీఫులు వేసుకుంటాయి. కచ్చితంగా పెద్ద పండగకే విడుదల చేయాలని మేకర్స్, హీరోలు ఫిక్స్ అవుతుంటారు. బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటారు.
వచ్చే ఏడాది సంక్రాంతి పండగకు కూడా పలు సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. అందుకు గాను ఇప్పటికే ఆయా చిత్రాల మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకు అనుగుణంగా సినిమాలకు సంబంధించిన పనులు పూర్తి చేసుకుంటున్నారు. త్వరలో తమ మూవీల రిలీజ్ డేట్స్ ను స్పెషల్ అప్డేట్స్ తో అనౌన్స్ చేయనున్నారు.
అయితే 2026 సంక్రాంతికి చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, విజయ్ జన నాయగన్ రిలీజ్ అవ్వనున్నాయి. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి కూడా విడుదలవుతుందని టాక్. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్ లో నటించిన అనగనగా ఒక రాజు కూడా పొంగల్ కు రానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్.
జనవరి 14వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ రావడంతో సినీ ప్రియులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు జనవరి 14వ తేదీన అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ అయ్యేటట్లు లేదని టాక్ వినిపిస్తోంది.
సంక్రాంతికి భారీ పోటీ ఉండడంతో అనగనగా ఒక రాజు మూవీ.. వెనకడుగు వేసిందని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జనవరి 23వ తేదీన సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అది కాకపోతే.. రిపబ్లిక్ డే వీకెండ్ లో విడుదల్వనుందని టాక్ వినిపిస్తోంది. కానీ మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే భారీ పోటీ ఉందని ఇప్పుడు తప్పుకున్నా.. ప్రచారంలో ఉన్న కొత్త తేదీ కూడా అంత సేఫ్ కాదు. ఎందుకంటే సంక్రాంతికి థియేటర్స్ లో భారీ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. వాటికి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా కొన్ని రోజులపాటు ఓ రేంజ్ లో సందడి చేస్తాయి. కాబట్టి అనగనగా ఒక రాజు కొత్త తేదీ కూడా కాస్త రిస్క్ తో కూడకున్నదే. అదే సమయంలో మూవీ రిలీజ్ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తోంది. మరి మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.
