Begin typing your search above and press return to search.

ఈసారి సంక్రాంతి మొత్తం మనోళ్లదే..!

2026 సంక్రాంతి కోసం తెలుగు ప్రేక్షకులు గత ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   8 Jan 2026 12:44 PM IST
ఈసారి సంక్రాంతి మొత్తం మనోళ్లదే..!
X

2026 సంక్రాంతి కోసం తెలుగు ప్రేక్షకులు గత ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సారి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి పెద్ద సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు భారీగా రావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ ఏకంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గత నెల వరకు ఈ ఐదు సినిమాల్లో కనీసం ఒకటి రెండు అయినా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఐదు సినిమాలకు ఐదు సినిమాలు ఇప్పటికే సెన్సార్‌ క్లియరెన్స్‌ తెచ్చుకుని మరీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఐదు సినిమాలకు తోడుగా తమిళ సినిమాలు సైతం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగులో మంచి మార్కెట్‌ ఉన్న విజయ్‌, శివ కార్తికేయన్‌ ల సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి.

విజయ్‌ జననాయగన్‌ సినిమా వాయిదా...

ఇప్పటికే విజయ్‌ హీరోగా నటించిన జననాయగన్‌ సినిమా మొత్తంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. టెక్నికల్‌ ఇష్యూస్‌ అంటూ సినిమాను వాయిదా వేయడం జరిగింది. ఇక శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన పరాశక్తి సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయాలని మొదటి నుంచి ప్లాన్‌ చేశారు. అందుకు తగ్గట్లుగానే కొన్ని తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా సీన్స్‌ చేశారని కూడా వార్తలు వచ్చాయి. తెలుగు మార్కెట్‌కి తగ్గట్లుగా టైటిల్‌ను పెట్టారు. చివరకు సినిమాను తెలుగులో విడుదల చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగు సినిమాల నుంచి ఉన్న భారీ పోటీ కారణంగా తమిళ డబ్బింగ్‌ సినిమాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు అని ఎగ్జిబిటర్స్ చేతులు ఎత్తేశారట. దాంతో చేసేది లేక కేవలం తమిళ్‌లో మాత్రమే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రమోషన్స్‌ చేయాల్సి ఉన్నా యూనిట్‌ సభ్యులు మొదలు పెట్టక పోవడంతో కేవలం తమిళ్‌ లో మాత్రమే విడుదల కానున్నట్లు తేలిపోయింది.

శివ కార్తికేయన్‌ హీరోగా పరాశక్తి

శివ కార్తికేయన్‌కి తెలుగులో ఉన్న మార్కెట్‌ నేపథ్యంలో కొందరు ప్రముఖ నిర్మాతలు సంక్రాంతికి కాకుండా వారం లేదా రెండు వారాల తర్వాత రిలీజ్‌ చేయడం కోసం రైట్స్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక విజయ్ సినిమా విడుదల లేకపోవడంతో ఇదే నెల చివరి వారం లేదా ఫిబ్రవరి వరకు విడుదల చేసే అవకాశం ఉంది. విజయ్ సినిమా క్యాన్సిల్‌ కావడంతో కార్తీ నటించిన వా వాథియర్ ను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. తమిళ్‌లో హడావిడిగా పొంగల్‌కి రానున్న ఆ సినిమా తెలుగులో విడుదల అనేది దాదాపు అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కనుక ఈ సంక్రాంతికి ఇతర భాషల సినిమాలు ఏమీ లేవు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలు సంక్రాంతికి సోలోగానే సత్తా చాటేందుకు రెడీ అయ్యాయి.

రాజాసాబ్‌, మన శంకర వరప్రసాద్‌ గారు...

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్‌ 'రాజాసాబ్‌' సినిమా రేపు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో ముందు దించుతున్న నేపథ్యంలో అందరి చూపు ఈ సినిమాపై ఉంది. ఆకట్టుకునే కథ, కథనంతో ఈ సినిమాను మారుతి రూపొందించాడు. ఇక అనిల్‌ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్‌తో చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్‌ గారు సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికి తప్పకుండా చూడాల్సిన సినిమాలు అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ఇవే కాకుండా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగ ఒక రాజు, ఇక చివరగా శర్వానంద్‌ హీరోగా నటించిన నారి నారి నడుమ మురారి సినిమా సంక్రాంతి బరిలో నిలువబోతున్నాయి. ఈ ఐదు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని సాధించబోతున్నాయి అనేది అతి త్వరలోనే క్లారిటీ రాబోతుంది.