దళపతి దిగితే చిరంజీవి కి ఇబ్బందేనా?
సంక్రాంతికి ఇప్పటికే కొన్ని సినిమాలు లాక్ అయ్యాయి. ప్రధానంగా నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది.
By: Srikanth Kontham | 5 Dec 2025 9:00 PM ISTసంక్రాంతికి ఇప్పటికే కొన్ని సినిమాలు లాక్ అయ్యాయి. ప్రధానంగా నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. `ది రాజాసాబ్`, `మన శంకర వరప్రసాద్ గారు`, `భర్త మహాశయులకు`, `నారీ నారీ నడుమ మురారీ` లాంటి చిత్రాల మధ్య పోటీ తప్పదు. వీటితో పాటు, కోలీవుడ్ నుంచి దళపతి విజయ్ నటిస్తోన్న `జన నాయగన్` కూడా రిలీజ్ అవు తుంది. ఇంత పోటీ ఉన్నా? నేనెక్కడా తగ్గనంటూ నవీన్ పోలిశెట్టి కూడా `అనగనగా ఒక రాజు`తో వస్తున్నాడు. మరి వీరందరిలో థియేటర్ల పరంగా సేఫ్ లో ఉన్నది ఎంత మంది? అంటే...`ది రాజాసాబ్` జనవరి 9న రిలీజ్ అవుతుంది.
థియేటర్లు అన్ని కళకళ:
సంక్రాంతి రేసులో మొట్ట మొదట రిలీజ్ ఇదే కావడంతో? భారీ ఎత్తున ముందుగానే థియేటర్లను బ్లాక్ చేస్తుంది. అదే రోజున `జన నాయగన్` కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా కొన్ని థియేటర్లను ముందుగానే లాక్ చేస్తుంది. అయితే `జన నాయగన్` థియేట్రికల్ రిలీజ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది? అన్నది రిలీజ్ చేసే సంస్థ మీద ఆధారపడి ఉంటుంది. అగ్ర సంస్థ రంగంలోకి దిగిందంటే థియేటర్ల పరంగా చూడాల్సిన పనిలేదు. ఇదే జరిగితే గనుక ఆ ఎఫెక్ట్ చిరంజీవి సినిమాపై పడే అవకాశం లేకపోలేదు. శంకర వరప్రసాద్ రిలీజ్ తేదీ ఇంకా ప్రకటించలేదు.
హిట్ టాక్ వస్తే మరింత కఠినం:
సంక్రాంతికి అని కర్చీప్ వేసారు కానీ, తేదీ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. జనవరి 9 తర్వాతే రిలీజ్ అవుతుంది. కానీ తేదీపై క్లారిటీ లేకపోవడం అన్నది చిక్కుగా మారింది. `జన నాయగన్` ని పెద్ద సంస్థ రిలీజ్ చేస్తే థియేటర్లన్నీ బ్లాక్ అవుతాయి. ఇన్ని రోజలు పాటు ఆడించాలి అనే కండీషన్ ఉంటుంది. అదే సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే? వర ప్రసాద్ పరిస్థితి మరింత జఠిలంగా మారుతుంది. ఆ సినిమా కంటూ ఫిక్స్ డు గా కొన్ని థియేటర్లు ఉన్నా? అప్పటికప్పుడు అదనంగా థియేటర్ల సంఖ్యను పెంచడం అన్నది అంత ఈజీగా జరగదు.
వాళ్ల నుంచి ఒత్తిడి తప్పదు:
పంపిణీ సంస్థల నుంచి కూడా కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా హిట్ టాక్ వచ్చిన సినిమా లకే వెళ్తున్నారు. సినిమాపై ఏమాత్రం నెగిటివ్ టాక్ ఉన్నా? అందులో ఎంత పెద్ద స్టార్ నటించినా చూడటం లేదు. `జన నాయగన్` బాలయ్య నటించిన `భగవంత్ కేసరి`కి రీమేక్ అంటున్నారు. కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ `జన నాయగన్` లో కొత్తగా ఏం చూపించారు? అన్న ఆసక్తితో అటువైపు గా మళ్లే అవకాశం లేకపోలేదు. ఇటీవలే బాలయ్య అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల మధ్య కొంత వైరానికి కూడా దారి తీసాయి. సోషల్ మీడియా వేదికగా ఇరు హీరోల అభిమానులు దూషించుకోవడం జరిగింది. మిగతా చిత్రాలు ఈ రిలీజ్ లను బట్టి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.
