సంక్రాంతి విన్నర్స్: బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశారంటే..
ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. పెద్ద హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలు కూడా తమ సత్తా చాటుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచారు.
By: M Prashanth | 20 Jan 2026 6:13 PM ISTఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. పెద్ద హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలు కూడా తమ సత్తా చాటుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. పండుగ సెలవులను పక్కాగా వాడుకుంటూ, విడుదలైన వారం రోజుల్లోనే మెజారిటీ సినిమాలు సేఫ్ జోన్‌లోకి వచ్చేయడం విశేషం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రస్తుత కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే సంక్రాంతి విన్నర్స్ ఎవరనేది క్లియర్‌గా అర్థమవుతోంది.
ముందుగా మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ విధ్వంసం సృష్టించింది. ఈ సినిమా సుమారు 122 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా, కేవలం 6 రోజుల్లోనే ఆ మార్కును దాటేసింది. దాదాపు 26.93 కోట్ల లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వింటేజ్ చిరు కామెడీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో లాంగ్ రన్ లో ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ సంక్రాంతికి అసలైన ట్విస్ట్ ఇచ్చింది నవీన్ పొలిశెట్టి సినిమా. ఆయన నటించిన 'అనగనగా ఒక రాజు' కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని అందరినీ షాక్ కు గురిచేసింది. 28 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా, ఇప్పటివరకు 37.59 కోట్ల షేర్ సాధించి సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. సుమారు 9.57 కోట్ల లాభాలను ఖాతాలో వేసుకున్న నవీన్, తన కామెడీ టైమింగ్‌తో యూత్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు.
శర్వానంద్ నటించిన 'నారి నారి నడుమ మురారి' కూడా సైలెంట్‌గా వచ్చి డీసెంట్ హిట్‌గా నిలిచింది. 10.25 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా, 7 రోజుల్లో గమ్యాన్ని చేరుకుంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 11.29 కోట్ల షేర్ వసూలు చేసి, సుమారు 1.04 కోట్ల లాభంతో కొనసాగుతోంది. అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ దాటేయడంతో, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వచ్చేశారు.
ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం, ఈ సినిమాలన్నీ దాదాపుగా అంచనాలను అందుకున్నాయి. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిరు సినిమాకు మాస్ ఆడియన్స్, నవీన్ సినిమాకు యూత్, శర్వానంద్ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ తోడవ్వడం ఈ విజయాలకు ప్రధాన కారణం. గత ఏడాది సంక్రాంతితో పోలిస్తే, ఈసారి సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీకి శుభపరిణామం అని చెప్పవచ్చు.
ఏదేమైనా ఈ సంక్రాంతి సీజన్ ముగిసే సమయానికి బయ్యర్లంతా హ్యాపీగా ఉన్నారు. రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా తనదైన శైలిలో వసూళ్లను రాబడుతుండగా, ప్రభాస్ రాజాసాబ్ మాత్రం టార్గెట్ విషయంలో చాలానే వెనుకబడింది. ఆ సినిమా ఇంకా దాదాపు 40% శాతం వెనక్కి తీసుకు రావాల్సి ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్‌లో ఈ సినిమాలు ఎలా హోల్డ్ చేస్తాయో చూడాలి.
