Begin typing your search above and press return to search.

నానాటికీ పెరుగుతున్న పొంగ‌ల్ పోటీ!

అందుకే ప్ర‌తీ సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ ప‌డుతుంటాయి. ఈ నేప‌థ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ప‌లు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Sept 2025 1:00 AM IST
నానాటికీ పెరుగుతున్న పొంగ‌ల్ పోటీ!
X

సినిమాల‌కు మంచి సీజ‌న్ అంటే పండ‌గ సీజ‌నే. సంక్రాంతికి సెల‌వలుంటాయి కాబ‌ట్టి మామూలుగా అయితే ఒక టికెట్ తెగేది పండ‌గ టైమ్ లో ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్ తెగుతాయ‌ని చాలామంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌మ సినిమాల‌ను పండ‌గ‌కు తీసుకురావాల‌ని టార్గెట్ గా పెట్టుకుంటారు. పండ‌గ సీజ‌న్ లో సినిమాకు మంచి టాక్ వ‌స్తే ఇక ఆ స‌క్సెస్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఇయ‌ర్ రిలీజైన సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా చూపించింది.

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు పండ‌క్కి వ‌స్తున్నారు

అందుకే ప్ర‌తీ సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ ప‌డుతుంటాయి. ఈ నేప‌థ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ప‌లు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. చూస్తుంటే ఈసారి పోటీ కాస్త గ‌ట్టిగానే ఉండేట్టుంది. ఇప్ప‌టికే సంక్రాంతికి కొన్ని సినిమాలు రానున్న‌ట్టు ప్ర‌క‌టించగా, మ‌రికొన్ని సినిమాలు సంక్రాంతిపై క‌న్నేశాయి. అందులో అంద‌రికంటే ముందే సంక్రాంతికి త‌మ సినిమా వ‌స్తుంద‌ని చెప్పింది చిరంజీవి. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చిరూ చేస్తున్న మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కానుంది.

పోటీలో రాజా సాబ్, అఖండ‌2 కూడా..

మొన్న‌టివ‌ర‌కు త‌మ సినిమాను డిసెంబ‌ర్ 5న రిలీజ్ చేస్తామ‌ని చెప్పిన ది రాజా సాబ్ కూడా ఇప్పుడు పండ‌గ బ‌రిలోకే రానుంది. జ‌న‌వ‌రి 9న రాజా సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇది కాకుండా బాల‌కృష్ణ అఖండ‌2 కూడా సంక్రాంతి పోటీకి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ర‌వితేజ- కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాను మేక‌ర్స్ సంక్రాంతికే రిలీజ్ చేస్తామ‌ని అనౌన్స్‌మెంట్ రోజే చెప్పారు.

న‌వీన్ పోలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు జ‌న‌వ‌రి 14న రిలీజ్ కానుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. వీటితో పాటూ ఇప్పుడు మ‌రిన్ని సినిమాలు సంక్రాంతి వైపు చూస్తున్నాయ‌ని తెలుస్తోంది. శ‌ర్వానంద్ నారీ నారీ న‌డుమ మురారితో పాటూ అల్ల‌రి న‌రేష్ ఆల్క‌హాల్ కూడా అదే సీజ‌న్ పై క‌న్నేశాయంటున్నారు. మ‌రి వీటిలో చివ‌ర‌కు పండ‌గ బ‌రిలో ఏయే సినిమాలు నిలుస్తాయో? వాటిలో ఏ మూవీ పండ‌గ విజేత‌గా నిలుస్తుందో చూడాలి.