సంక్రాంతి చిత్రాలు.. టిక్కెట్ హైక్స్ సంగతేంటి?
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 14 Dec 2025 3:00 PM ISTతెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఎందుకంటే గత ఏడాది పుష్ప 2: ది రూల్ మూవీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం.. ఇకపై టికెట్ రేట్లు పెంచుకునేందుకు, స్పెషల్ షోలు వేసేందుకు అనుమతులు ఇవ్వమని
ప్రకటించింది.
కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలకు అవకాశం ఇచ్చింది. దసరాకు వచ్చిన ఓజీ సినిమా విషయంలో ప్రీమియర్స్, రేట్లు పెంపునకు అనుమతులు ఇచ్చి జీవోను జారీ చేసింది సర్కార్. కానీ హైకోర్టు మాత్రం ప్రీమియర్స్ కు కొన్ని గంటల ముందు రద్దు చేసింది. ఆ తర్వాత ఇటీవల అఖండ 2: తాండవం విషయంలోనూ అలాంటిదే జరిగింది.
అది జరిగిన కొన్ని గంటలకు ఇకపై ఎవరూ తమ వద్దకు రేట్లు పెంచమని రావొద్దని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తమకు రిక్వెస్ట్ చేయొద్దని.. ఎలాంటి అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు సంక్రాంతి సినిమాల విషయంలో ఏం జరుగుతుందోనని నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
పుష్ప ఘటన తర్వాత పలు సినిమాలకు ఇచ్చినా.. రీసెంట్ గా కోమటిరెడ్డి అలా ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు సంక్రాంతి చిత్రాల విషయంలో నిర్మాతకు లాస్ తప్పదా అని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే పొంగల్ కు రానున్న కొన్ని మూవీల నిర్మాతలు మాత్రం.. రేట్లు పెంపునకు ఛాన్స్ ఇస్తారేమోనంటూ ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే సంక్రాంతికి వస్తున్న చిత్రాల్లో ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు మూవీలు ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాల నిర్మాతలు ఇప్పుడు వేర్వేరు సందర్భాల్లో టికెట్ రేట్ల పెంపుపై మాట్లాడారు. తమ సినిమా రేట్ల పెంపు విషయంలో సర్కార్ జీవో జారీ చేస్తుందని మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిర్మాత సాహు గారపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాము మూడు రోజులకే పెంచుతామని.. అది కూడా తక్కువేనని అన్నారు. రూ.50-70 పెంచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాజ్ సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు. అప్పుడు సర్కార్ చెప్పే బట్టి ప్లాన్ చేస్తామని అన్నారు. ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరి సంక్రాంతి చిత్రాల రేట్ల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
