Begin typing your search above and press return to search.

సంక్రాంతికైనా ఆ హీరోల ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫ‌లిస్తాయా?

కానీ కొంద‌రు హీరోల ఫ్యాన్స్ మాత్రం కొత్త సంవ‌త్స‌రాన్ని నిరాశ‌తోనే మొద‌లుపెట్టారు. వారిలో మ‌రీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ గురించి. వీరిద్ద‌రూ

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Jan 2026 9:00 PM IST
సంక్రాంతికైనా ఆ హీరోల ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫ‌లిస్తాయా?
X

చూస్తూ చూస్తూనే 2025 పూర్తైపోయి 2026లోకి అడుగుపెట్టాం. గ‌తేడాది ఎన్నో సినిమాలు రిలీజై ఆడియ‌న్స్ ను అల‌రించ‌గా, 2026 మ‌రిన్ని కొత్త సినిమాల‌తో ఇంకా ఎగ్జైటింగ్ గా ఉండ‌నుంది. అందుకే న్యూ ఇయ‌ర్ వ‌చ్చిన సంద‌ర్భంగా టాలీవుడ్ ఆడియ‌న్స్ లో కొత్త జోష్ నెల‌కొంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చిత్ర మేక‌ర్స్ కూడా త‌మ త‌మ సినిమాల నుంచి అప్డేట్స్ ను ఇచ్చారు.

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ప‌లు సినిమాల నుంచి అప్డేట్స్

కొంద‌రు త‌మ సినిమాల నుంచి ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేస్తే, మ‌రికొంద‌రు ప్ర‌మోష‌న‌ల్ వీడియోలు, కొత్త పోస్ట‌ర్ల‌తో అంద‌రూ ఆడియ‌న్స్ కు న్యూ ఇయ‌ర్ గ్రీటింగ్స్ చెప్పారు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వ‌ర‌కు అన్ని మూవీస్ కు సంబంధించిన అప్డేట్స్ వ‌చ్చాయి. అప్డేట్స్ ఇవ్వ‌ని స్టార్ హీరోలు త‌మ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కు సంబంధించిన ఫోటోల‌ను అయినా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

నిరాశ‌లో ఆ హీరోల ఫ్యాన్స్

కానీ కొంద‌రు హీరోల ఫ్యాన్స్ మాత్రం కొత్త సంవ‌త్స‌రాన్ని నిరాశ‌తోనే మొద‌లుపెట్టారు. వారిలో మ‌రీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ గురించి. వీరిద్ద‌రూ కొత్త సినిమాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఆయా సినిమాల‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ కానీ, పోస్ట‌ర్లు కానీ, క‌నీసం వారి సినిమాల నుంచి విషెస్ కానీ రాక‌పోవ‌డం అంద‌రినీ డిజ‌ప్పాయింట్ చేసింది.

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆల్మోస్ట్ టాలీవుడ్ లోని స్టార్ హీరోలంద‌రి సినిమాల నుంచి అప్డేట్స్ వ‌చ్చాయి. కొంద‌రి సినిమాల నుంచి అప్డేట్స్ రాక‌పోయినా ఆయా స్టార్ల వెకేష‌న్ ఫోటోలైనా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కు సంబంధించి మాత్రం ఎలాంటి ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌క‌పోవ‌డంతో వారిద్ద‌రి అభిమానులు నిరాశ‌లో ఉన్నారు. మిగిలిన అంద‌రి అభిమానులు త‌మ త‌మ అభిమాన న‌టుల న్యూ ఇయ‌ర్ ఫోటోల‌ను షేర్ చేసుకుంటుంటే తాము మాత్రం ఏం చేయ‌లేక‌పోతున్నామ‌ని వారు బాధ ప‌డుతున్నారు.

సంక్రాంతి అప్డేట్స్ కోసం ఎదురుచూపులు

అయితే ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. ఇప్పుడే అప్డేట్స్ ఇస్తే చాలా తొంద‌ర‌ప‌డిన‌ట్టు ఉంటుంద‌ని చిత్ర యూనిట్ భావించి ఉండ‌టం తోనే ఎలాంటి అప్డేట్‌ను మేక‌ర్స్ ఇచ్చి ఉండ‌ర‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఇక చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పెద్ది మూవీ ఆల్మోస్ట్ అయిపోవ‌చ్చింది. పెద్ది ఆఖ‌రి ద‌శ‌లో ఉంది, పైగా మార్చిలోనే రిలీజ్ కాబ‌ట్టి న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఏదొక చిన్న అప్డేట్ అయినా వ‌స్తుంద‌ని అంద‌రూ ఆశించారు కానీ అది రాక‌పోవ‌డంతో నిరాశ త‌ప్ప‌లేదు. మ‌రి మేక‌ర్స్ ఫ్యాన్స్ ఫీలింగ్స్ ను అర్థం చేసుకుని సంక్రాంతికి అయినా ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.