పండుగ రేసులో.. చిరు వెంకీతో పాటు మరో బిగ్ స్టార్
టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే పెద్ద సినిమాల హోరు ఎక్కువగా ఉంటుంది. ఏటా ఎవరో ఒకరిద్దరు స్టార్ హీరోలు పండుగ బరిలో నిలవడం చూస్తూనే ఉన్నాం.
By: M Prashanth | 2 Feb 2026 3:15 PM ISTటాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే పెద్ద సినిమాల హోరు ఎక్కువగా ఉంటుంది. ఏటా ఎవరో ఒకరిద్దరు స్టార్ హీరోలు పండుగ బరిలో నిలవడం చూస్తూనే ఉన్నాం. ఇక మరికొందరు చిన్న సినిమాలతో వచ్చి బిగ్ హిట్స్ అందుకోవడం సహజమే. అయితే 2027 సంక్రాంతి విషయంలో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కనిపిస్తోంది. ముగ్గురు అగ్ర హీరోలు ఒకేసారి తమ సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండటంతో, బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొనేలా ఉంది. థియేటర్ల కేటాయింపు, వసూళ్ల పరంగా ఈ క్లాష్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తోంది.
ప్రస్తుతం ఉన్న లైనప్ చూస్తుంటే ఇటు సీనియర్ హీరోలు, అటు పాన్ ఇండియా స్టార్ ఒకే సమయంలో థియేటర్లలోకి రాబోతున్నారు. సాధారణంగా సెలవుల అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, పెద్ద సినిమాలన్నీ ఇదే సమయాన్ని ఎంచుకుంటుంటాయి. ఈసారి మాత్రం ముగ్గురు స్టార్ల సినిమాలు ఒకదాని వెనుక ఒకటి లైన్ లో ఉండటంతో ప్రేక్షకులు ఏ సినిమాకు ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయం ఏంటంటే ప్రభాస్, చిరంజీవి, వెంకటేష్ 2027 సంక్రాంతి బరిలో తలపడబోతున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాను జనవరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక పీరియడ్ డ్రామా కావడంతో సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా కూడా పండుగ రేసులో ఉండే అవకాశం ఉంది. గతంలో వీరు కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పక్కా ప్లానింగ్ తో జరుగుతున్నాయి. దీంతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చే సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే పండుగ సీజన్ తమకు ప్లస్ అవుతుందని వారు భావిస్తున్నారు. ఇలా ముగ్గురు హీరోలు ఒకేసారి రావడం వల్ల బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు చీలిపోయే ఛాన్స్ ఉన్నా, సెలవుల వల్ల సినిమాలకు మంచి ఓపెనింగ్స్ దొరుకుతాయని ట్రేడ్ వర్గాల టాక్. ఏ హీరో ఏ సినిమాతో పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా 2027 సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఇప్పుడే మొదలైపోయింది. ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురు హీరోలు తమ డేట్స్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ వస్తే గానీ ఈ పోటీపై ఒక క్లారిటీ రాదు. పెద్ద హీరోల సినిమాలన్నీ ఒకేసారి పండుగకు రావడం సినీ ప్రియులకు మాత్రం ఒక మంచి విందు అని చెప్పొచ్చు. అలాగే ఆ సమయానికి మరికొందరు చిన్న సినిమాలతో వారి లక్కును పరీక్షించుకునే అవకాశం ఉంది.
