ప్రమోషన్స్ లేకుండా గట్టేక్కేస్తాయా..?
సంక్రాంతి వచ్చేస్తుంది.. ఈ సంక్రాంతికి తెలుగులో ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
By: Ramesh Boddu | 7 Jan 2026 9:15 AM ISTసంక్రాంతి వచ్చేస్తుంది.. ఈ సంక్రాంతికి తెలుగులో ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి పండుగ వారం రోజుల హాలీడేస్ ని టార్గెట్ చేస్తూ ఈ ఐదు సినిమాలు వస్తున్నాయి. ఐతే ఈ సినిమాల రేంజ్ బాగానే ఉన్నా ప్రమోషన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకడుగు కనిపిస్తుంది. పొంగల్ రేసులో ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తితో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాలు వస్తున్నాయి.
ఆశించిన స్థాయిలో లేని సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్..
అసలే ఫెస్టివల్ టైం అందులోనూ పోటీగా చాలా సినిమాలు వస్తున్నాయి. అలాంటి టైంలో ఒక సినిమాను మించి మరో సినిమా ప్రమోట్ చేయాలి. కానీ సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవని చెప్పొచ్చు. అందరిలో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తున్నాడు నవీన్. సినిమా అంతా తన భుజాన వేసుకుని తీసుకొస్తున్నాడు.
ఇక రవితేజ, శర్వానంద్ ఐతే ఇప్పటివరకు తమ సినిమా గురించి బయట ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. రాజా సాబ్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఎంచక్కా ప్రభాస్ ఫారిన్ వెళ్లాడు. మన శంకర వర ప్రసాద్ కోసం చిరంజీవి రంగంలో దిగాల్సి ఉంది. ఐతే సినిమా రిలీజ్ ముందు ఎంత బాగా ప్రమోట్ చేస్తే ఆడియన్స్ అంత ఎక్కువ ఎంగేజ్ ఉంటుంది. అలా కాకుండా వస్తే కచ్చితంగా రిజల్ట్ వేరేలా ఉంటుంది.
సినిమా గురించి ఆడియన్స్ కి తెలిసేలా..
ఐతే తమ కంటెంట్ మీద నమ్మకంతో ప్రమోషన్స్ సోసోగా ఉన్నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం నిజమే కానీ పోటీగా ఐదు సినిమాలు రేసులో ఉన్నప్పుడు కచ్చితంగా సినిమా గురించి ఆడియన్స్ కి తెలిసేలా చేయాలి. సంక్రాంతికి తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఆదరిస్తారు. రాజా సాబ్ థ్రిల్లర్ తో వస్తున్నా అది కూడా అందరినీ నవ్విస్తుందట. సో ఈసారి సంక్రాంతికి ఆడియన్స్ ని ఎవరు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారో వాళ్లదే విజయం వరిస్తుంది అన్నమాట.
ఐతే రాజా సాబ్ ఆల్రెడీ రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాకు ప్రభాస్ ఇంటర్వ్యూస్ ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. ఐతే ఎం.ఎస్.జి కోసం చిరంజీవి మాత్రం ప్రింట్, ఎలెక్ట్రానిక్, సోషల్ మీడియా ఇలా అన్నిటికీ ఇంటర్వ్యూస్ ఇచ్చే ప్లానింగ్ ఉందట. రవితేజ, శర్వానంద్ అయితే ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. నవీన్ ఆల్రెడీ సోలో ప్రమోషన్స్ తో అనగనగా ఒక రాజు సినిమాకు బూస్టింగ్ ఇస్తున్నాడు. సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ డల్ గానే ఉన్నా ఆ సినిమాల బాక్సాఫీస్ జోష్ ఎలా ఉంటుందో చూడాలి. ఐతే పొంగల్ ఫైట్ లో వస్తున్న ప్రతి సినిమా తమ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐదు సినిమాల రిలీజ్ లో మాక్సిమం సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పొచ్చు.
