పాటలతోనే హైప్ ఎక్కిస్తున్నారుగా!
ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ఈ ఏడాది పోటీ మరింత రసవత్తరంగా ఉండనుంది.
By: Sravani Lakshmi Srungarapu | 8 Jan 2026 4:28 PM ISTప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ఈ ఏడాది పోటీ మరింత రసవత్తరంగా ఉండనుంది. ఈ ఇయర్ సంక్రాంతికి తెలుగులో మంచి మంచి సినిమాలే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ప్రభాస్ రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ కానుండగా, ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ కానుంది.
జనవరి 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, 14వ తేదీన నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, 15వ తేదీన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాల్లో వేటికవే స్పెషల్ క్రేజ్, హైప్ ను కలిగి ఉన్నాయి. కాగా వీటిలోని మూడు సినిమాల్లోని ఒక్కో పాట ఆ సినిమాకు ఉన్న హైప్ ను ఇంకాస్త బాగా పెంచి, ఆయా సినిమాలకు బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.
నచ్చే నచ్చే సాంగ్ కు మంచి రెస్పాన్స్
వాటిలో ముందుగా ది రాజాసాబ్ నుంచి నచ్చే నచ్చే పాట. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు సాంగ్స్ వచ్చి ఆడియన్స్ ను అలరించగా, రీసెంట్ గా సినిమాలోని ముగ్గురు హీరోయిన్లతో వచ్చిన నచ్చే నచ్చే సాంగ్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ తర్వాత సినిమాపై మరింత హైప్ వచ్చింది.
హుక్ స్టెప్ సాంగ్ తో అదరగొట్టిన మెగాస్టార్
ఇక చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజవగా వాటిలో వేటికవే మంచి చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. రీసెంట్ గా నాలుగో సాంగ్ గా హుక్ స్టెప్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో చిరంజీవి వేసిన స్టెప్పులు సాంగ్ ను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తున్నాయి.
హైప్ పెంచిన వామ్మో వాయ్యో సాంగ్
ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తిలో కూడా ఇలాంటి ఓ పాట ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీని అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు హీరోయిన్లతో ఓ డ్యాన్స్ నెంబర్ ను పెట్టి అందరూ షాకయ్యేలా చేశారు కిషోర్ తిరుమల. వామ్మో వాయ్యో అంటూ రీసెంట్ ఈ సినిమా నుంచి రిలీజైన పాట సినిమాకు మంచి హైప్ ను తెచ్చింది. మరి ఈ సాంగ్స్ లాగానే సినిమాలు కూడా ఆడియన్స్ ను అదే మేర ఆకట్టుకుంటాయో చూడాలి.
