2026 సంక్రాంతి అంతా సరదా సరదాగానే!
సాధారణంగా సంక్రాంతి రిలీజ్ లు అంటే రకరకాల జానర్ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోలందరి టార్గెట్ సీజన్ కాబట్టి ఏ హీరో ఈ సీజన్ మిస్ చేసుకోడు.
By: Srikanth Kontham | 1 Dec 2025 4:00 AM ISTసాధారణంగా సంక్రాంతి రిలీజ్ లు అంటే రకరకాల జానర్ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోలందరి టార్గెట్ సీజన్ కాబట్టి ఏ హీరో ఈ సీజన్ మిస్ చేసుకోడు. తాము చేసింది ఎలాంటి జానర్ చిత్రమైనా రిలీజ్ అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో రకరకాల జానర్లు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. కానీ ఈ సంక్రాంతి మాత్రం అంతా సరదా సరదాగానే గడవనుందా? వినోదమంతా సరదాగానే సాగుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో `ది రాజాసాబ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది పక్కా మారుతి మార్క్ ఎంటర్ టైనర్. ఇదొక రొమాంటిక్ హారర్ జానర్ చిత్రం.ఈ జానర్ లో చిత్రం చేయాలని ఉందని ప్రభాస్ `ప్రేమ కథా చిత్రం` టైమ్ లోనే అన్నాడు. ఆ కథలో మారుతి డీల్ చేసిన కామెడీ అంశాలు నచ్చడంతో? అప్పటి నుంచి ఆ తరహా చిత్రం చేయాలని ఆశపడుతున్నాడు. ఆ కోరిక `రాజాసాబ్` తో తీరుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. ప్రభాస్ కొత్తగా కామెడీ కూడా ట్రై చేస్తున్నాడు.
ప్రభాస్ టైమింగ్ కి మారుతి తోడవ్వడంతో? థియేటర్ అంతా నవ్వులు పువ్వులు పూయడం ఖాయమే. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న `మన శంకర వరప్రసాద్ గారు` గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమా ప్రారంభానికి ముందే కామెడీ ఎంటర్ టైనర్ అని రివీల్ చేసారు. అనీల్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఆయనకు చిరు తోడయ్యారు కాబట్టి నెక్స్ట్ లెవల్ కామెడీ పండించనున్నారు. ఇక మాస్ రాజా రవితేజ యాక్షన్ సినిమాలు చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి `భర్తమహాశయులకువిజ్ఞప్తి` అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోన్నచిత్రమిది. కుటుంబ అంశాలకు రవితేజ శైలి వినోదం జోడించి తీస్తోన్న చిత్రమిది. మాస్ రాజా కామెడీ వర్కౌట్ అయితే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. ఇంత మంది అగ్ర హీరోలున్నా? యువ హీరో నవీన్ పోలిశెట్టి ఎంత మాత్రం వెనక్కి తగ్గలేదు. నవీన్ నటిస్తోన్న `అనగనగా ఒక రాజు` కూడా ఇదే సీజన్ లో రిలీజ్ అవుతుంది. మారి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో ఆద్యంతం వినోదాన్ని అందించే చిత్రంగా తెలుస్తోంది. మొత్తంగా ఈ సంక్రాంతికి నాలుగు చిత్రాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే కథలే. `జన నాయకుడు`, `పరాశక్తి` లాంటి చిత్రాలు రేసులో ఉన్నా? ఆ రెండు తమిళ అనువాద చిత్రాలు.
