Begin typing your search above and press return to search.

సంక్రాంతి హీరోలు.. అందుకే లైట్ తీసుకున్నారా ఏంటి?

సినీ సంక్రాంతి సందడి మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రంతో స్టార్ట్ అవ్వనుంది.

By:  M Prashanth   |   8 Jan 2026 12:52 PM IST
సంక్రాంతి హీరోలు.. అందుకే లైట్ తీసుకున్నారా ఏంటి?
X

సినీ సంక్రాంతి సందడి మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రంతో స్టార్ట్ అవ్వనుంది. జనవరి 9వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. నేడు రాత్రి ప్రీమియర్స్ పడనున్నాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజతోపాటు యంగ్ హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ థియేటర్స్ లోకి రానున్నారు.

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సందడి చేయనుండగా.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీతో, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రంతో సందడి చేయనున్నారు. అలా ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఏకంగా ఐదుగురు హీరోలు రావడం విశేషం.

అదే సమయంలో ఐదుగురు హీరోలు నటించిన ఆయా సినిమాల నుంచి కొన్ని రోజులుగా రోజుకొక అప్డేట్ వస్తూనే ఉంది. కానీ హీరోలు మాత్రం అంతగా ఎక్కడా కనిపించడం లేదు. సినిమాల రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్నా.. కథానాయకుల సందడి అనుకున్న స్థాయిలో లేదు. ఇప్పటి వరకు ఎవరూ కూడా మీడియాతో మాట్లాడలేదు. మాట్లాడతారనే అప్డేట్ కూడా లేదు.

ముందుగా ప్రభాస్.. ఇప్పటికే ఇటలీ వెళ్లిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంగ్ స్పీచ్ ఇచ్చిన ఆయన.. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అయితే ప్రభాస్ ఎప్పుడూ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటారు.. ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇప్పుడు రాజా సాబ్ కు అదే పద్ధతి ఫాలో అయ్యారు. ఆ తర్వాత మెగాస్టార్ కూడా ఇప్పటి వరకు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు.

అదే సమయంలో రవితేజ కూడా ఆ కోవలోనే ఉన్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చారు కానీ సైలెంట్ గానే ఉన్నారు. సినిమాపై ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత శర్వానంద్ సేమ్ అలాగే చేస్తున్నారు. చాలా అంటే చాలా సైలెంట్ గా ఉన్నారు. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం సందడి చేస్తున్నారు. ప్రమోషన్స్ ను ముందుండి నడిపిస్తున్నారు. కానీ ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వలేదు.

ఇప్పుడు ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి హీరోలంతా ఎందుకు ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నారో వారికే తెలియాలి. అయితే సంక్రాంతికి టాక్ తో సంబంధం లేకుండా సినిమాలు చూస్తారు ఆడియన్స్. ప్రమోషన్స్ లేకపోయినా థియేటర్స్ కు వెళ్లి వీక్షిస్తారు. అందుకే లైట్ తీసుకున్నారోమోనని కొందరు నెటిజన్లు అంటున్నారు. అందులో నిజమెంతో హీరోలకే తెలియాలి.