Begin typing your search above and press return to search.

సంక్రాంతి చిత్రాలు.. ఏ ఓటీటీలోకి రానున్నాయి?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   6 Dec 2025 10:42 AM IST
సంక్రాంతి చిత్రాలు.. ఏ ఓటీటీలోకి రానున్నాయి?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నిజానికి మామూలు సీజన్స్ కన్నా అప్పుడే సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మూవీ లవర్స్. చాలా మంది దాన్ని ఒక ఆనవాయితీగా కూడా తీసుకుంటారు. పొంగల్ కు మూవీకి వెళ్లాల్సిందే అని ఫిక్స్ అవుతుంటారు.

దీంతో హీరోలు, దర్శక నిర్మాతలంతా సంక్రాంతికే సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు గాను ముందు నుంచి కర్చీఫులు వేసుకుంటారు. అలా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా అనేక సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈసారి కూడా గట్టి పోటీ ఉండనున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ తో సినీ పొంగల్ సందడి మొదలు కానుంది. జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. ఆ రోజు రాజా సాబ్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి జన నాయగన్ కూడా విడుదల అవ్వనుంది. ఇక ఆ రెండు సినిమాలతోపాటు మరో నాలుగు చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మాస్ మహారాజా రవితేజ కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యంగ్ హీరో శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారి మూవీతో పొంగల్ కానుకగా వస్తున్నారు.

మరో యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు పొంగల్ కు రిలీజ్ అవ్వనున్నట్లు ఇప్పటికే పలుమార్లు ఆ సినిమా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన సినిమాలన్నింటితోపాటు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి కూడా సంక్రాంతికే రానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ పక్కా.

అయితే ఇప్పటికే సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఆయా మేకర్స్.. ఓటీటీ డీల్స్ ను కంప్లీట్ చేశారు. ఒప్పందాల ప్రకారం.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక సంక్రాంతి చిత్రాలు అన్నీ ఆయా ఓటీటీల్లోకి రానున్నాయి. మరి ఏ సినిమా.. ఏ ఓటీటీలోకి రానుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ది రాజా సాబ్- జియో హాట్ స్టార్

జననాయగన్- అమెజాన్ ప్రైమ్ వీడియో

నారీ నారీ నడుమమురారి- అమెజాన్ ప్రైమ్‌ వీడియో

మన శంకరవరప్రసాద్ గారు- జీ5

భర్త మహాశయులకు విజ్ఞప్తి- జీ5

అనగనగా ఒకరాజు- నెట్‌ ఫ్లిక్స్

పరాశక్తి- నెట్ ఫ్లిక్స్