Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేస్..గ్లామ‌ర్ వేవ్‌తో ఆ ముగ్గురే టాప్‌!

సంక్రాంతి స‌మ‌రంలో ముందుగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న మూవీ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ కామెడీ హార‌ర్ యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్ `ది రాజాసాబ్‌`.

By:  Tupaki Entertainment Desk   |   30 Dec 2025 5:23 PM IST
సంక్రాంతి రేస్..గ్లామ‌ర్ వేవ్‌తో ఆ ముగ్గురే టాప్‌!
X

ప్ర‌తి సంక్రాంతికి తెలుగు సినిమాలు భారీ స్థాయిలో పోటీప‌డుతుండ‌టం అంద‌రికి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో సినిమాలు రిలీజ్ చేయాల‌ని, భారీ క్రౌడ్‌ని క్యాష్ చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొట్టాల‌ని స్టార్ హీరోల నుంచి స్టార్ డైరెక్ట‌ర్ల వ‌ర‌కు ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి బ‌రిలో త‌మ సినిమాల‌తో నిలుస్తుంటారు.

అదే త‌ర‌హాలో 2026 సంక్రాంతికి ప‌లు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతున్నాయి. పాన్ ఇండియా సినిమాల‌తో పాటు మినిమ‌మ్ బ‌డ్జెట్ చిత్రాల వ‌ర‌కు విడుద‌ల‌వుతున్నాయి.

ఈ సినిమాల‌తో స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లే కాకుండా స్టార్ హీరోయిన్‌లు కూడా త‌మ సినిమాల‌తో బ‌రిలోకి దిగుతూ ఈ సంక్రాంతికి గ్లామ‌ర్‌ని యాడ్ చేస్తున్నారు. న‌య‌న‌తార నుంచి కేథ‌రిన్ వ‌ర‌కు ఈ సంక్రాంతికి పోటీప‌డుతున్నారు. ఈ పోటీలో ముగ్గురు క్రేజీ భామ‌లు మాత్రం పై చేయి సాధిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి స‌మ‌రంలో ముందుగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న మూవీ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ కామెడీ హార‌ర్ యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్ `ది రాజాసాబ్‌`. జ‌న‌వ‌రి 9నే ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది.

ఇందులో ముగ్గురు క్రేజీ భామ‌లు మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బిజినెస్ ప‌రంగా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుని ప్రేక్ష‌కుల్లో హైప్‌ని క్రియేట్ చేసింది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ మూవీ ట్రైల‌ర్ సినిమాపై కొంత మందిలో ఉన్న అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేసింది. ఇందులో గ్లామ‌ర్ డోస్‌తో క‌నిపించి మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ది కుమార్ అటెన్ష‌న్‌ని గ్రాబ్ చేయ‌డంలో టాప్‌లో నిలిచారు.

ఇదే రేసులో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు` మూవీతో న‌య‌న‌తార‌, కేథ‌రిన్ బ‌రిలోకి దిగుతున్నారు. అయితే ఇందులో గ్లామ‌ర్ డోస్ త‌గ్గించ‌డంతో ఈ ఇద్ద‌రు ప్రేక్ష‌కుల అటెన్ష‌న్‌ని మాత్రం గ్రాబ్ చేయ‌లేక‌పోయారు. ఇక మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా కిషోర్ తిరుమ‌ల రూపొందిస్తున్న `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో ర‌వితేజ‌కు జోడీగా అషిక రంగ‌నాథ్‌, డింపుల్ హ‌యాతీ న‌టించారు. ఈ ఇద్ద‌రిలో అషిక రంగ‌నాథ్ బికినీ ధ‌రించి హీట్ పుట్టించే ప్ర‌య‌త్నం చేసినా ప్రేక్ష‌కుల దృష్టిని మాత్రం ఆక‌ర్షించ‌లేక‌పోయింది.

శ‌ర్వానంద్ సైలెంట్‌గా `నారీ నారీ న‌డుమ మురారి`తో బ‌రిలోకి దిగుతున్నాడు. ఇందులో సాక్షీ వైద్య‌, సంయుక్త హీరోయిన్‌లుగా న‌టించారు. సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి హ‌డావిడీ లేక‌పోవ‌డంతో వీరి ప్ర‌భావం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి న‌టించిన `అన‌గ‌న‌గ ఒక రాజు` కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. ఇందులో న‌వీన్‌కు జోడీగా మీనాక్షీ చౌద‌రి న‌టించింది. సినిమా అంతా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో మీనాక్షికి గ్లామర్‌కు స్పేస్ ల‌భించ‌లేదు. దీంతో వీరింద‌రినీ ప‌క్క‌కు నెట్టి గ్లామ‌ర్ డోస్‌తో `ది రాజా సాబ్‌` భామ‌లు మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ది కుమార్ సంక్రాంతి స‌మ‌రంలో పైచేయి సాధించి టాప్‌లో నిలిచారు. త‌మ‌దైన మార్కు గ్లామ‌ర్‌తో ఈ సంక్ర‌తికి ప్రేక్ష‌కుల‌ని ఈ భామ‌లు మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నారు.