సీక్రెట్ చెప్పకుండా సంకల్ప్ తొలిసారి!
యువ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఎలాంటి సినిమా చేసినా? ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ ముందే రివీల్ చేసి సినిమా తీయడం అన్నది అతడి ప్రత్యేకత.
By: Sivaji Kontham | 27 Oct 2025 6:00 PM ISTయువ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఎలాంటి సినిమా చేసినా? ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ ముందే రివీల్ చేసి సినిమా తీయడం అన్నది అతడి ప్రత్యేకత. `ఘాజీ`, `అంతరిక్షం`, `ఐబీ 71` లాంటి చిత్రాలు అలాగే తెరకె క్కించాడు. ఈ మూడు వాస్తవ కథలు కావడంతో? వాటి గురించి ప్రేక్షకులకు ఓ ఐడియా ఉండటంతో? అందులో ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్ గా కథ ఇదని చెప్పి చేసాడు. `ఘాజీ`,` అంతరిక్షం` లాంటి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. `ఘాజీ` సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ అలాంటి ప్రతిభావంతుడికి అవకాశాలు రావు? అని మరోసారి అతడి విషయంలో ప్రూవ్ అయింది.
విరామానికి ముందు యాక్షన్ సీన్స్:
సంకల్ప్ సినిమాలు ఇన్నో వేటివ్ గా ఉంటాయి. అతడు రెగ్యులర్ కమర్శియల్ డైరెక్టర్ కాదు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలని తపించే డైరెక్టర్. ఓ కథ కోసం ఎంతో అన్వేషిస్తుంటాడు. అలాంటి సంకల్ప్ ఈ సినిమా విషయంలో మాత్రం సినిమా స్టోరీ ఏంటి? అన్నది చెప్పకుండా చేస్తున్నాడు. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇదొక చారీత్రాత్మక నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రం. సినిమాకు సంబంధించి ఈ లైన్ తప్ప ఇంకే విషయం తెలియదు. సంకల్ప్ కూడా అంతే గోప్యంగా ఉంచాడు. గత సినిమాల తరహాలో ఇది ఫలానా కథ అని ఎక్కడా ఓపెన్ అవ్వలేదు.
సరికొత్త పాత్రలో మ్యాచో స్టార్:
ఇప్పటికే 55 రోజుల చిత్రీకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం విరామానికి ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. స్టంట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు.
గోపీచంద్ కెరీర్ లో ఇంత వరకూ ఈ తరహా పాత్రలు పోషించలేదు. గతంలో రా ఏజెంట్ తరహా పాత్రలు పోషించాడు. కానీ వాస్తవ కథల్లో ప్రత్యేకించి చారీత్రాత్మక కథల్లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. విభిన్నమైన పాత్రలో గోపీచంద్ అలరించడం ఖాయంగా టీమ్ చెబుతుంది.
హిట్ కోసం కసిగా:
భారత చరిత్రలో ఎంతో కీలకమైన అధ్యాయాన్ని ఈ చిత్రం ద్వారా సంకల్ప్ ఆవిష్కరించబోతున్నట్లు నెట్టింట హైలైట్ అవుతుంది. కానీ ఆ ఆధ్యాయం ఏంటి? అన్నదే బయటకు రాలేదు. దీంతో సినిమా రిలీజ్ వరకూ ఈ సస్పెన్స్ తప్పదని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాలు రిలీజ్ అయితే అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అంత వరకూ ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఈ సినిమా విజయం గోపీచంద్-సంకల్ప్ రెడ్డి ఇద్దరికీ కీలకమై. వాళ్లిద్దరు గతంలో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో ఈ సినిమాతో హిట్ కొట్టాలని సంకల్పించి పని చేస్తున్నారు.
